రేణు దేశాయ్ రెండో భ‌ర్త ఇత‌గాడే..!

రేణు దేశాయ్ మ‌రోసారి ఇంటిదైపోయింది. త‌న జీవితంలో మ‌రో వ్య‌క్తికి చోటిచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో విడిపోయిన త‌ర్వాత 8 ఏళ్లుగా ఒంట‌రిగానే ఉన్న రేణు.. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ తోడును వెతుక్కుంది. త‌న‌కంటూ కొత్త జీవితాన్ని ఆవిష్క‌రించుకుంది. జీవితంలో అన్నింటికంటే బాధ క‌లిగించే అంశం ఒంట‌రిగా ఉండ‌టం. తోడు లేకుండా ఉండ‌టం కంటే దారుణం.. న‌ర‌కం ఇంకోటి ఉండ‌దు. జీవితంలో ఈ ఒంట‌రిత‌నం చాలా అనుభ‌వించింది రేణుదేశాయ్. ఎనిమిదేళ్లుగా పిల్ల‌లే లోకంగా బ‌తికేస్తుంది ప‌వ‌న్ మాజీ భార్య‌. అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ప‌దేళ్లు స‌హ‌జీవ‌నం చేసిన రేణు.. రెండేళ్లు భార్య‌గా కూడా ఉంది.

జానీ నుంచి క‌లిసున్న ఈ జంట‌.. 2008లో పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత కొన్ని రోజులు క‌లిసున్న ప‌వ‌న్.. రేణు కార‌ణం చెప్ప‌కుండానే విడిపోయారు. రేణుతో విడిపోయిన త‌ర్వాత అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. కానీ రేణు మాత్రం ఒంట‌రిగానే మిగిలిపోయింది. అయితే అర్థం చేసుకునేవాడు దొరికితే పెళ్లి చేసుకుంటాన‌ని ఈ మ‌ధ్యే చెప్పింది రేణు. ఇప్పుడు ఆ వ్య‌క్తి దొరికాడు. అందుకే పెళ్లి చేసుకుంది.

సైలెంట్ గా ఎలాంటి సంద‌డి లేకుండా త‌న పిల్ల‌ల స‌మ‌క్షంలోనే పెళ్లి చేసుకుంది రేణు దేశాయ్. ఇన్నాళ్లూ భ‌ర్త ఫోటోను చూపించ‌డానికి కాస్త ఆలోచించిన రేణు ఇప్పుడు బ‌య‌టికి తీసుకొచ్చింది. నీతో ఉంటే చాలా సంతోషంగా.. ప్ర‌శాంతంగా ఉంటానని.. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ వ‌ద‌ల‌కు.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావని ఈ మ‌ధ్యే లెట‌ర్ కూడా రాసుకొచ్చింది రేణుదేశాయ్. మొత్తానికి ఇప్పుడు రేణుకు కూడా తోడు దొరికింద‌న్న‌మాట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here