రోబో నిర్మాత‌లు అనౌన్స్ చేసారోచ్..!

 

రోబో లాంటి సినిమా నిర్మించాలంటే అంత వీజీ కాదు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 130 కోట్ల‌తో వ‌చ్చిన సినిమా ఇది. అది కూడా ఏడేళ్ల కిందే. ర‌జినీ హీరోగా శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రం అప్ప‌ట్లోనే 240 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. కానీ అదేం విచిత్రమో కానీ రోబో వ‌చ్చి ఏడేళ్లైనా ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్ పిక్చ‌ర్స్ మాత్రం ఏడేళ్లుగా ఏ పెద్ద సినిమా నిర్మించ‌లేదు. క‌నీసం అనౌన్స్ కూడా చేయ‌లేదు. రిస్క్ వ‌ద్ద‌నుకున్నారో ఏమో కానీ స్టార్స్ తో సినిమాలు నిర్మించ‌డ‌మే మానేసారు. ఇన్నాళ్ల‌కు విజ‌య్-మురుగ‌దాస్ చిత్రం నిర్మించ‌డానికి ముందుకొచ్చింది స‌న్ పిక్చ‌ర్స్. దాదాపు 120 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.
త‌మిళ‌నాట ర‌జినీ త‌ర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజ‌య్. గ‌తంలో క‌త్తి.. తుపాకి లాంటి సెన్సేష‌న‌ల్ సినిమాలు ఈ కాంబినేష‌న్ లోనే వ‌చ్చాయి. పైగా ఈ మ‌ధ్యే మెర్స‌ల్ సినిమాతో చ‌రిత్ర సృష్టించాడు విజ‌య్. ఈ చిత్రం ఏకంగా 255 కోట్లు వ‌సూలు చేసింది. తెలుగులోనూ అదిరిందిగా వ‌చ్చి అద‌ర‌గొట్టాడు విజ‌య్. దాంతో మురుగ‌దాస్ కు ఇప్పుడు ఇంకా బాధ్య‌త పెరిగిపోయింది.  క‌త్తి, తుపాకికి ఏ మాత్రం తీసిపోని రీతిలో మ‌రో కొత్త త‌ర‌హా క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు విజ‌య్-మురుగ‌దాస్. జ‌న‌వ‌రి నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టించ‌నుంది. ఏఆర్ రెహ‌మాన్ మ‌రోసారి విజ‌య్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ కాంబినేష‌న్ పై ఇప్ప‌టికే త‌మిళ‌నాట బోలెడు అంచ‌నాలు మొద‌లైపోయాయి. 2018 ద‌స‌రాకు ఈ చిత్రం విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here