ర‌కుల్.. నువ్వు కూడా బుద్ధి చూపించావుగా..


ఏరుదాటిన త‌ర్వాత తెప్ప తీర్చే వారిలా.. ర‌కుల్ మారిపోయింది. ఇక్క‌డ ఉన్న‌పుడు బాలీవుడ్ కంటే త‌న‌కు తెలుగు ఇండ‌స్ట్రీ అంటేనే ఎక్కువ‌గా ఇష్ట‌మ‌ని చెప్పిన ర‌కుల్ బేబీ ఇప్పుడేమో జై బోలో బాలీవుడ్ అంటుంది. అలా అన్నా ప‌ర్లేదు కానీ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీని త‌క్కువ చేస్తుంది ఈ భామ‌. ఇక్క‌డే స్టార్ అయిన ఈ ముద్దుగుమ్మ‌.. తెలుగులోనే క‌థ‌లు బాగా రావ‌ట్లేదంటూ నోరు పారేసుకుంది. అస‌లు ఇప్పుడు ఈ భామ మాట్లాడిన మాట‌లు చూసి అంతా షాక్ అవుతున్నారు. బుద్ధి చూపించింది క‌దా అంటూ విమ‌ర్శిస్తున్నారు. ఈ మ‌ధ్యే మ్యాగ్జిమ్ అంటేనే అందాల మ్యాగ్జిమ‌మ్ అని అర్థం. అక్క‌డికి వెళ్లారంటే అన్నీ ఓపెన్ ఆఫ‌ర్ అని అర్థం. ఇప్పుడు ర‌కుల్ కు కూడా ఇది త‌ప్పలేదు.
మ్యాగ్జిమ్ కోసం అన్నీ తెరిచేసి కెమ‌రాకు ప‌రిచేసింది ర‌కుల్ ప్రీత్ సింగ్. ప్ర‌స్తుతం ఈమె క‌ళ్ల‌న్నీ బాలీవుడ్ పైనే ఉన్నాయి. అక్క‌డే సెటిల్ అయి పోవాల‌ని మాస్ట‌ర్ ప్లాన్ వేస్తుంది ర‌కుల్. ఇప్ప‌టికే ఫిబ్ర‌వ‌రి 16న ఈమె న‌టించిన అయ్యారీ విడుద‌ల కానుంది. దానికి వారం రోజుల ముందే ఇలా హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది ర‌కుల్. ఇక అక్ష‌య్ కుమార్, అజయ్ దేవ్ గ‌న్ లాంటి హీరోల‌తోనూ రొమాన్స్ చేసే అవ‌కాశం అందుకుంది ఈ భామ‌. మొత్తానికి ఈమె దూకుడు చూస్తుంటే ర‌కుల్ ఇక తెలుగు ఇండ‌స్ట్రీకి పూర్తిగా బైబై చెప్పిన‌ట్లుగానే అనిపిస్తుంది. బై చెప్పేసి కామ్ గా ఉండ‌కుండా తెలుగు ఇండ‌స్ట్రీపై నోరు పారేసుకోవ‌డం మాత్రం ర‌కుల్ కు అంత మంచిది కాదంటున్నారు విశ్లేష‌కులు. ఎంతైనా బాలీవుడ్ బాప‌త్ క‌దా.. ఆ మాత్రం బుద్ధి చూపించ‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here