ర‌జినీని టార్గెట్ చేసిన మాఫియా..

అవును.. ఇప్పుడు మాఫియాకు బాగానే దొరికిపోయాడు ర‌జినీకాంత్. అదేంటో కానీ ఈయ‌న‌లో ఎప్పుడూ ఓ డాన్ నే చూస్తున్నారు ద‌ర్శ‌కులు. ప్ర‌తీ ద‌ర్శ‌కుడు రావ‌డం.. డాన్ క‌థ చెప్ప‌డం.. ఈయ‌న ఓకే చేయ‌డం చ‌కాచ‌కా జ‌రిగిపోతున్నాయి. ఇప్ప‌టికే రంజిత్ తో క‌బాలి, కాలా సినిమాల్లో ఇలాంటి కారెక్ట‌ర్సే చేసాడు సూప‌ర్ స్టార్. ఆ రెండు ఫ్లాప్ అయ్యాయి. కాలా అయితే మ‌రీ దార‌ణంగా డిజాస్ట‌ర్ అయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కార్తిక్ సుబ్బ‌రాజ్ తో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం డెహ్రాడూన్లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. అక్క‌డ ఓ విల్లాను అద్దెకు తీసుకుని షూట్ చేస్తున్నాడు కార్తిక్. దీనికి ర‌జినీ విల్లా అని పేరు కూడా పెట్టేసారు. ఇక ఆ త‌ర్వాత మ‌ధురైలో ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా ఓ సెట్ వేసారు.
అక్క‌డ త‌ర్వాతి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు కార్తిక్ సుబ్బ‌రాజ్. ఈ సినిమాలో ర‌జినీకాంత్ ప‌గ‌లు హాస్టల్ వార్డెన్ గా.. రాత్రి మాఫియా డాన్ గా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఇలాంటి డాన్ వేశాలేంటో కానీ సినిమా విడుద‌లైతే కానీ తెలియ‌దు. ర‌జినీ వ‌ర‌స ఫ్లాపుల నేప‌థ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ సినిమాపై కూడా అంచనాలు త‌క్కువ‌గా ఉన్నాయి. ఈ చిత్రం త‌ర్వాత ర‌జినీకాంత్ పూర్తిస్థాయి రాజ‌కీయాల్లో బిజీ అవుతార‌నే వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. కాలాలో నానా ప‌టేక‌ర్ తో న‌టించిన ర‌జినీ.. ఈ సారి నవాజుద్దీన్ సిద్ధికీతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఇక సీనియ‌ర్ హీరో సిమ్రాన్ ఇందులో కీలక పాత్రలో న‌టిస్తుంది. మొత్తానికి ర‌జినీకాంత్ ను మాఫియా టార్గెట్ చేసిందో.. లేదంటే ఈయ‌నే మాఫియాను టార్గెట్ చేసాడో తెలియ‌దు కానీ దొందు దొందే అయిపోయిందిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here