ర‌వితేజ మార్కెట్ ఇంత దారుణ‌మా..? 

Mass Ravi Teja Interview Photos (3)
ఒక‌ప్పుడు ర‌వితేజ సినిమా అంటే మినిమ‌మ్ వ‌సూళ్లు వ‌చ్చేవి. సినిమా ఫ్లాప్ అయినా కూడా క‌చ్చితంగా మినిమ‌మ్ గ్యారెంటీ వ‌సూళ్లు వ‌చ్చేవి. అంతేకాదు స్టార్ హీరో అన్న‌పుడు టాక్ తో ప‌నిలేకుండా క‌నీస ఓపెనింగ్స్ అయినా రావాలి. కానీ ఇప్పుడు ర‌వితేజ విష‌యంలో అది జ‌ర‌గట్లేదు. ఈయ‌న మార్కెట్ దారుణంగా ప‌డిపోయింది. ఎంత‌లా అంటే.. మూడేళ్ల కింద కిక్ 2 సినిమా తొలిరోజు 6 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత రాజా ది గ్రేట్ 5.50 కోట్ల‌కు ప‌డిపోయింది. ఇప్పుడు ట‌చ్ చేసి చూడు అయితే మ‌రీ దారుణంగా కేవ‌లం 4 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌సూలు చేసింది. అనుష్క భాగ‌మ‌తి కంటే త‌క్కువ వ‌సూళ్లు ఇవి. నాని రేంజ్ తో పోలిస్తే స‌గానికి ప‌డిపోయాడు ర‌వితేజ ఇప్పుడు. ఎంసిఏ తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల షేర్.. వ‌ర‌ల్డ్ వైడ్ గా 10 కోట్ల షేర్ సాధించింది. కానీ ఇప్పుడు ర‌వితేజ దానికి స‌గం కూడా తీసుకురాలేదు. ఇది ఇలాగే సాగితే ర‌వితేజ మార్కెట్ మ‌రింత దారుణంగా ప‌డిపోవ‌డం ఖాయం. రాజా ది గ్రేట్ తో కాస్త ప‌ర్లేదు అనిపించిన ర‌వితేజ‌.. ఇప్పుడు మ‌రోసారి రేస్ లో వెన‌క బ‌డిపోయాడు. నాని లాంటి కుర్రాళ్ల‌ను త‌ట్టుకోవాలంటే ఈయ‌న వ‌ర‌స సినిమాలు చేయ‌డం మాత్ర‌మే కాదు.. విజ‌యాలు కూడా అందుకోవాలి. అలా చేయ‌క‌పోతే మ‌రో రెండేళ్ల‌లో మాస్ రాజా పూర్తిగా గాడిత‌ప్ప‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here