ల‌వ‌ర్ ట్రైల‌ర్.. నాకు చ‌రిత కావాలి..!


అస‌లే రాజ్ త‌రుణ్ ఆశ‌ల‌న్నీ ల‌వ‌ర్ సినిమాపైనే ఉన్నాయి. అలాంటి సినిమా ట్రైల‌ర్ ఇప్పుడు విడుద‌లైంది. కొత్త‌గా అయితే ఏం లేదు కానీ చెత్త‌గా కూడా లేదు. రొటీన్ ల‌వ్ డ్రామాకే కాస్త యాక్ష‌న్ మిక్స్ చేసాడు ద‌ర్శ‌కుడు. సినిమాలో ఎంత విష‌యం ఉందో తెలియ‌దు కానీ ట్రైల‌ర్ లో మాత్రం ఓల్డ్ స్ట‌ఫ్ ఎక్కువ‌గా క‌నిపించింది.
రాజ్ త‌రుణ్ లుక్ కొత్త‌గా ఉంది. ఇప్ప‌టికే దిల్ రాజే త‌న సినిమాల్లో చాలా ఇలాంటి సీన్స్ చూపించి ఉంటాడు. త‌ను ప్రేమించిన అమ్మాయికి క‌ష్టం రావ‌డం.. ఆ త‌ర్వాత ఆమె కోసం ప్రేమికుడు పోరాడ‌టం.. ఇప్ప‌టికే చాలా సినిమాల్లో క‌నిపించిన సీన్సే కానీ ఇప్పుడు మ‌రోసారి అదే చేస్తున్నాడు. నిమిషం 54 సెక‌న్ల ట్రైల‌ర్ లో చూసి సినిమా ఇలా ఉంటుంది అని డిసైడ్ చేయ‌డం త‌ప్పే కానీ ట్రైల‌ర్ మాత్రం రొటీన్ గానే ఉంది.
మ‌రోవైపు రాజ్ త‌రుణ్ మార్కెట్ ఇప్పుడు క‌నీసం కోటి రూపాయ‌లు కూడా వ‌సూలు చేయ‌లేని స్థాయికి దిగ‌జారిపోయింది. ఇలాంటి టైమ్ లో జులై 20న ల‌వ‌ర్ తో వ‌స్తున్నాడు త‌రుణ్. దిల్ రాజు నిర్మాత కావ‌డంతో ఈ చిత్రంతో క‌చ్చితంగా త‌ను ఫామ్ లోకి వ‌స్తాన‌ని న‌మ్ముతున్నాడు రాజ్ త‌రుణ్. తొలి సినిమా అలా ఎలాను కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కించిన ఈయ‌న ఇప్పుడు మాత్రం ప్యూర్ ల‌వ్ స్టోరీగా వ‌స్తున్న ల‌వ‌ర్.. రాజ్ త‌రుణ్ ఆశ‌ల్ని ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో తెలియ‌దు. ఈ చిత్రంలో రిద్ది కుమార్ హీరోయిన్ గా న‌టిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here