వామ్మో.. ఏంటీ మిడిల్ క్లాస్ సునామీ..!

MCA
టైటిల్ చూస్తే మిడిల్ క్లాస్ అబ్బాయి.. కానీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చేసే ప‌నులు చూస్తే మాత్రం అప్ప‌ర్ క్లాస్ కు అమ్మ‌మ్మ‌లా ఉన్నాయి. ఎంసిఏ క‌లెక్ష‌న్లు చూస్తుంటే ఇప్పుడు ఎవ‌రికైనా క‌ళ్లు బైర్లు గ‌మ్మాల్సిందే. అస‌లు ఈ రేంజ్ లో వ‌సూళ్లు వ‌స్తాయ‌ని దిల్ రాజు.. నాని కూడా ఊహించ‌లేదేమో..? ఏం న‌చ్చిందో తెలియ‌దు కానీ ఈ మిడిల్ క్లాస్ అబ్బాయికి బాగా క‌నెక్ట్ అయిపోయారు ప్రేక్ష‌కులు. నాని కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు అతిపెద్ద హిట్ గా ఉన్న ఈగ తొలివారం రికార్డుల‌ను సైతం తుడిచి పారేసాడు మిడిల్ క్లాస్ అబ్బాయి. ఇక ఈ ఏడాది మొద‌ట్లో వ‌చ్చిన నేనులోక‌ల్ తొలి వారంలో 22 కోట్ల‌కు వ‌సూలు చేస్తే.. ఇప్పుడు ఎంసిఏ 8 రోజుల్లోనే 30.50 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లు చేస్తే.. తొలి వారం లోనే ఈ వ‌సూళ్లు తీసుకొచ్చేసాడు నాని. ఇక రెండో వారం వ‌చ్చేదంతా లాభ‌మే. ఇప్ప‌టికే చాలా ఏరియాల్లో లాభాల్లోకి వ‌చ్చేసింది ఎంసిఏ. నైజాంలో అయితే ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఇప్ప‌టికే ఇక్క‌డ 11 కోట్ల మార్క్ అందుకున్నాడు నాని. నాని ఖాతాలో ఈగ‌.. నేనులోక‌ల్ త‌ర్వాత మూడో సారి నైజాంలో 10 కోట్ల మార్క్ అందుకున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ఎంతైనా ఇప్పుడు నాని రేంజ్ బాగా పెరిగిపోయింద‌బ్బా. ఈ వారం ఒక్క‌క్ష‌ణం.. 2 కంట్రీస్ ఉన్నా నాని దూకుడును ఆపుతాయా అనే అనుమానం అయితే ఉంది. దాంతో మ‌రో వారం కూడా మిడిల్ క్లాస్ అబ్బాయికి క‌లిసి రానుంది. చూస్తుంటే మిడిల్ క్లాస్ అబ్బాయి ప్ర‌యాణం నేనులోక‌ల్ ను దాటేసి 40 కోట్ల వైపుగా చేరుకునేలా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here