విజ‌య్ క్రేజ్ ను ఇలా వాడేస్తున్నారా..? 

ఒక్క సినిమా హిట్టైతే చాలు.. ఇక్క‌డ ఎక్క‌డ‌లేని ఆశ‌ల‌న్నీ వ‌చ్చేస్తుంటాయి. ఆయ‌న పాత సినిమాల‌ను కూడా త‌వ్వి బ‌య‌టికి తీస్తుంటారు. ఇది ఎప్ప‌ట్నుంచో ఉన్న‌దే. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అర్జున్ రెడ్డి త‌ర్వాత ఎంత క్రేజ్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ కుర్ర హీరోకు ఇప్పుడు అభిమానులు కూడా వ‌చ్చేసారు. పెళ్లిచూపులు సాఫ్ట్ గోయింగ్ అయినా.. అర్జున్ రెడ్డి హార్ట్ హిట్టింగ్. తెలుగు సినిమాను ఒక్క‌సారి కుదిపేసిన సినిమా ఇది. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ ఏం చేసినా చూడ్డానికి ప్రేక్ష‌కులు సిద్ధంగా ఉన్నారు. దాంతో ఈయ‌న ఆ మ‌ధ్య ఎప్పుడో పెళ్లిచూపులు త‌ర్వాత ఓకే చేసిన ఓ సినిమాను ఇప్పుడు బ‌య‌టికి తీసుకొస్తున్నారు. ఆ సినిమా పేరు ఏం మంత్రం వేసావే. కొత్త ద‌ర్శ‌కుడితో విజ‌య్ చేసిన ఈ సినిమా ఇన్నాళ్లూ బాక్సుల్లోనే ఉండిపోయింది.
ఇప్పుడు మ‌నోడి క్రేజ్ చూసి ఎలాగైనా దాని బాక్సులు బ‌య‌టికి తీయాల‌ని ఫిక్సైపోయారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అందుకే ఇప్ప‌టికిప్పుడు దానికి మేక‌ప్పులు వేసి విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. మే లో విజ‌య్ న‌టించిన ట్యాక్సీవాలా విడుద‌ల కానుంది. దానికి ముందే ప‌రుశురామ్ సినిమా కూడా వ‌స్తుంది. ఆ రెండు సినిమాల‌కు ముందు కానీ ఏం మంత్రం వేసావే వ‌చ్చి ఏదైనా తేడా కొడితే విజ‌య్ కెరీర్ పై మ‌రో మ‌చ్చ‌గా మారిపోతుంది ఈ చిత్రం. ఎందుకంటే గ‌తంలో సాయిధ‌రంతేజ్ మంచి ఊపులో ఉన్న‌పుడు కామెడీగా రేయ్, తిక్క లాంటి సినిమాలు వ‌చ్చి ఆయ‌న కెరీర్ ను ఎటూ కాకుండా చేసాయి. మ‌రి ఇప్పుడు విజ‌య్ ను ఏం మంత్రం వేసావే ఏం చేస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here