విజ‌య్ త‌మిళ డెబ్యూ అప్పుడే.. 

VIJAY DEVARAKONDA NEW MAKEOVER
తెలుగు అర్జున్ రెడ్డి ఇప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీకి కూడా వెళ్తున్నాడు. అక్క‌డ సినిమా చేస్తున్నాడు. మ‌నోన్ని ఎప్పుడెప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీకి తీసుకెళ్దామా అని వేచి చూస్తున్నారు అక్క‌డి ద‌ర్శ‌కులు. అన్న‌ట్లుగానే ఇప్పుడు త‌మిళ్ లో ఓ సినిమాకు క‌మిట‌య్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. విజ‌య్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అర్జున్ రెడ్డి మ‌త్తు ఇంకా వ‌ద‌ల‌క‌ముందే మూడు నాలుగు సినిమాలు సిద్ధం చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టికే తెలుగులో వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ స్టార్ గా మారుతున్నాడు. వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశం అంది పుచ్చుకుంటూ ముందుకెళ్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పైగా ఈ కుర్రాడు ఇలాంటి పాత్ర‌లోనే స‌రిపోతాడు అనే లిమిటేష‌న్స్ లేవు.. పెళ్లిచూపులు నుంచి అర్జున్ రెడ్డి వ‌ర‌కు క్లాస్ మాస్ తేడా లేకుండా కుమ్మేస్తాడు. దాంతో చిన్న నిర్మాత‌ల‌కు విజ‌య్ వ‌రంగా మారాడు. నాని ఈ రేంజ్ నుంచి స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు విజ‌య్ ఇదే దారిలో న‌డుస్తున్నాడు. విజయ్ డేట్స్ కోసం ఇండ‌స్ట్రీలో చాలా మంది అగ్ర నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే గీతాఆర్ట్స్ లో వ‌ర‌స‌గా రెండు సినిమాలు చేస్తున్నాడు విజ‌య్.
అల్లు అర‌వింద్ నిర్మాణంలో ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తోన్న‌ సినిమా షూటింగ్ పూర్తైంది. దీనికి గీతాగోవిందం అనే టైటిల్ పెట్టారు. దీంతోపాటు త్రివిక్ర‌మ్ నిర్మాణంలో నందినిరెడ్డి ద‌ర్శ‌కురాలిగా మ‌రో సినిమా చేస్తున్నాడు. ఇది ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంది. ఇక దాంతో పాటు రాహుల్ సంక్రీత్య‌న్ అనే కొత్త ద‌ర్శ‌కుల‌తో ఓ సినిమా మొద‌లుపెట్టాడు. భ‌ర‌త్ క‌మ్మ‌తోనూ ఓ సినిమా బ్యాలెన్స్ ఉంది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా క‌మిట్ అయ్యాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఇప్పుడు త‌మిళ ద‌ర్శ‌కుడు ఆనంద్ శంక‌ర్ తో ఓ బై లింగువ‌ల్ ప్రాడ‌క్ట్ కు విజ‌య్ ఓకే చెప్పాడు విజ‌య్. ఈ సినిమా మార్చ్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఈ లైన‌ప్ చూస్తుంటే ప‌క్కా పిచ్చి ఎక్కిపోవ‌డం ఖాయం. అస‌లు విజ‌య్ దూకుడు చూస్తుంటే మ‌రో హిట్ కొడితే మ‌నోన్ని అందుకోవ‌డం కూడా క‌ష్టం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here