విజ‌య్ పాట‌పై విమ‌ర్శ‌లు.

VIJAY-DEVARAKONDA-SONG-CONTRVERSY
విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా అంటే ఎలా ఉంది అని అడ‌గ‌డం మానేసి.. ఏంటి కాంట్ర‌వ‌ర్సీ అని అడ‌గాల్సి వ‌స్తుంది. ఎందుకంటే ఈయ‌న ఎంచుకుంటున్న క‌థ‌ల‌తో పాటు చేస్తోన్న ప్ర‌మోషన్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు కూడా గీత‌గోవిందంలో ఓ పాట పాడాడు విజయ్. వాట్ ది ఎఫ్ అంటూ సాగే ఈ పాట‌లో లిరిక్స్ పై ఇప్పుడు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. శ్రీ‌మ‌ణి రాసిన ఈ పాట సూప‌ర్ క్యాచీగా ఉంది.
విజ‌య్ దేవ‌ర‌కొండ ఎన‌ర్జిటిక్ వాయిస్ కు తోడు గోపీసుంద‌ర్ ట్యూన్ అదిరిపోయింది. అయితే అన్నీ బాగానే ఉన్నా.. పాట మ‌ధ్య‌లో సీతారాములు.. స‌తీసావిత్రి గురించి టాపిక్ వ‌చ్చింది. అప్పుడంటే అంతా మంచోళ్లే కానీ ఇప్పుడు అమ్మాయిల‌కు అంత సీన్ లేద‌ని చెప్ప‌డం ర‌చ‌యిత ఉద్దేశ్యం. కానీ రాముడు అడ‌వికి ర‌మ్మంటే..
నువ్వే వెళ్లు అని సీత అనేది. భ‌ర్త ప్రాణాలు యముడు తీసుకెళ్తుంటే సావిత్రి నెట్ ఫ్లిక్స్ చూస్తుండేదంటూ రాసుకొచ్చాడు శ్రీ‌మ‌ణి. ఇవే ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సీ అవుతున్నాయి. అక్క‌డ ద‌ర్శ‌కుడి కోణం త‌ప్పు కాదు.. ర‌చ‌యిత వైనం త‌ప్పు కాదు.. కానీ దేవ‌త‌ల పేర్లు వాడుకోవడం వివాదం అవుతుంది. మ‌రి ఈ కాంట్ర‌వ‌ర్సీ సాంగ్ ఇంకెన్ని సంచ‌ల‌నాలు చేస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here