విష్ణుకు రుణ‌ప‌డిపోయిన అనుష్క‌.. 

అవును.. నిజంగానే ఇప్పుడు మంచు విష్ణుకు అనుష్క రుణ‌ప‌డిపోయింది. అనుకోని వరం ఇచ్చి జేజ‌మ్మ‌ను గాల్లో తేలిపోయేలా చేస్తున్నాడు ఈ హీరో ఇప్పుడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే.. విష్ణు న‌టించిన ఆచారి అమెరికా యాత్ర జ‌న‌వ‌రి 26న విడుద‌ల కావాల్సింది. కానీ ఈ సినిమా ఇప్పుడు రావ‌డం లేదు. అనుకోని కార‌ణాల‌తో ఈ చిత్రం కాస్త ఆల‌స్యంగా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది. విష్ణు టీం కూడా ఈ విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసారు. అనివార్య కార‌ణాల‌తో ఆచారి యాత్ర ఆగిపోయింద‌ని.. ఫిబ్ర‌వ‌రిలో మంచి తేదీ చూసుకుని యాత్ర‌కు మ‌రో ముహూర్తం పెడ‌తామ‌ని చెబుతు న్నారు వాళ్లు. ఫిబ్ర‌వ‌రి 9న మోహ‌న్ బాబు న‌టించిన గాయ‌త్రి విడుద‌ల కానుంది. ఒక‌వేళ విడుదలైతే ఆచారి అమెరికా యాత్ర ఫిబ్ర‌వ‌రి 2నే రావాలి. లేదంటే రెండు వారాలు ఆగి రావాల్సిందే..! అప్ప‌టి వ‌ర‌కు ఆచారి బాక్సుల్లో ఉండ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. విష్ణు సినిమా కూడా వాయిదా ప‌డ‌టంతో ఇప్పుడు జ‌న‌వ‌రి 26న అనుష్క భాగ‌మ‌తి మాత్ర‌మే విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ తేదీన రావాల్సిన మ‌న‌సుకు న‌చ్చింది.. అభిమ‌న్యుడు సినిమాలు కూడా వాయిదా ప‌డ‌టంతో ఇప్పుడు అనుష్క సినిమా మాత్ర‌మే గ‌ణ‌తంత్రం రోజు విడుద‌ల కానుంది. చూడాలిక‌.. ఈ సోలో రిలీజ్ ను అనుష్క ఎంత‌వ‌ర‌కు యూజ్ చేసుకోనుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here