వెంకీతో త్రివిక్ర‌మ్.. కాంబినేష‌న్ అదిరిందిగా.

Venkatesh , Trivikram Srinivas ,Trivikram Srinivas movie, Haarika & Hassine Creations,

త్రివిక్ర‌మ్ తో వెంక‌టేశ్ మ‌ళ్లీ జ‌త క‌లుస్తున్నాడు. ఈ ఇద్ద‌రిది ఆల్రెడీ బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్. ద‌ర్శ‌కుడిగా మారిన త‌ర్వాత వెంక‌టేశ్ తో త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌లేదు కానీ అంత‌కుముందు మ‌ల్లీశ్వ‌రి, నువ్వు నాకు న‌చ్చావ్, వాసు సినిమాల‌కు క‌లిసి ప‌నిచేసారు ఈ జోడీ. ర‌చ‌యిత‌గా ఉన్న‌పుడు వెంక‌టేశ్ తోనే ఎక్కువ సినిమాలు చేసాడు త్రివిక్ర‌మ్. అయితే ద‌ర్శ‌కుడిగా మారిన త‌ర్వాత ఎందుకో ఈ కాంబినేష‌న్ క‌ల‌వ‌లేదు. ఎప్పుడూ వీలుకాలేదు కూడా. ప‌వ‌న్, మ‌హేశ్, బ‌న్నీ లాంటి స్టార్స్ కే త్రివిక్ర‌మ్ అంకితం అయిపోవ‌డంతో ఇత‌ర హీరోల‌కు చాన్స్ రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే త్రివిక్ర‌మ్ రూట్ మారుస్తున్నాడు. ఈయ‌న త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ తో సినిమా చేయ‌బోతున్నాడు. ఆ వెంట‌నే వెంక‌టేశ్ సినిమా ఉంటుంది. వెంకీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా త్రివిక్ర‌మ్ తో సినిమాను అనౌన్స్ చేసాడు నిర్మాత రాధాకృష్ణ‌. పైగా ప్ర‌స్తుతం ప‌వ‌న్ న‌టిస్తున్న అజ్ఞాత‌వాసి లోనూ వెంకీ అతిథిపాత్ర‌లో మెరుస్తున్నాడు. ఇక ఇప్పుడు హీరోగానే త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌బోతున్నాడు. వెంక‌టేశ్ తో లో బ‌డ్జెట్ లో సినిమా చేసి ఎక్కువ లాభాలు ఆర్జించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. ఎలాగూ త్రివిక్ర‌మ్-వెంకీ అంటే క‌నీసం 40 కోట్ల మార్కెట్ వ‌ర్క‌వుట్ అవుతుంది. చూడాలి ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో ఇక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here