వెన్నెల కిషోర్.. టైమ్స్ ర‌న్నింగ్ నౌ..!

అవును.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. టాలీవుడ్ లో ఉన్నంత మంది క‌మెడియ‌న్లు మ‌రే ఇండ‌స్ట్రీలోనూ లేరు. అయితే ఎంతమందున్నా ఒక్కోసారి ఒక్కో క‌మెడియ‌న్ హ‌వా బాగా న‌డుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ టైమ్ వెన్నెల కిషోర్ కు వ‌చ్చింది. డిఫెరెంట్ మాడ్యులేష‌న్.. మొహంలో క‌నిపించే ఫ‌న్నీ ఎక్స్ ప్రెష‌న్స్.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో విచిత్ర‌మైన ఇంగ్లీష్ ప‌దాలు.. అద్భుత‌మైన కామెడీ టైమింగ్.. ఇవ‌న్నీ వెన్నెల కిషోర్ సొంతం. అప్పుడెప్పుడో వెన్నెల సినిమాతో ప‌రిచ‌యం అయిన కిషోర్.. ఆ త‌ర్వాత స్టార్ క‌మెడియ‌న్ గా మార‌డానికి చాలా టైమ్ ప‌ట్టింది. సునీల్ హీరోగా మార‌డం మ‌నోడికి హెల్ప్ అయింది. బిందాస్ లాంటి సినిమాల్లో బాగా న‌వ్వించి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ క‌మెడియ‌న్ టైమ్ మొద‌లైంది. టాలీవుడ్ లో ఎవ‌రి టైమ్ ఎప్పుడు వ‌స్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు 30 ఇయ‌ర్స్ పృథ్వీ టైమ్ న‌డిచింది. ఇప్పుడు వెన్నెల టైమ్ మొద‌లైంది.
ఇప్పుడు ఏ తెలుగు సినిమాలో చూసినా వెన్నెల కిషోర్ ఉండాల్సిందే. ఆయ‌న కోస‌మే కారెక్ట‌ర్లు రాస్తున్నారు ద‌ర్శ‌కులు. ఈయ‌న కూడా అదే రేంజ్ లో ఆ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఈయ‌న లేకుండా సినిమా చేయ‌డ‌మే మానేసారు ద‌ర్శ‌కులు. చిన్నా పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాల్లో వెన్నెల కిషోర్ క‌చ్చితంగా ఉండాల్సిందే. లేక‌పోతే కామెడీ పండ‌ట్లేదు. పైగా వెన్నెల కిషోర్ కూడా రొటీన్ కామెడీతో కాకుండా కాస్త కొత్త‌గా ట్రై చేస్తున్నాడు. గ‌తేడాది వ‌చ్చిన రారండోయ్ వేడుక చూద్దాం, కేశ‌వ, అమీతుమీ, మ‌హానుభావుడు సినిమాల్లో వెన్నెల కిషోర్ దే కీ రోల్. ఇప్పుడు విడుద‌లైన ఛ‌లోలో అయితే సెకండాఫ్ ను పూర్తిగా వెన్నెల కిషోర్ నిల‌బెట్టాడు.
ఇగోయిస్టిక్ అండ్ సాడిస్టిక్ రోల్ లో వెన్నెల కిషోర్ కడుపులు చెక్క‌లు చేసాడు. ఈ పాత్రలో వెన్నెల‌ను త‌ప్ప మ‌రో న‌టున్ని ఊహించుకోలేం అన్నంత‌గా ఒదిగిపోయాడు కిషోర్. ఇక గ‌తేడాది వ‌చ్చిన ఆనందో బ్ర‌హ్మ‌లో రే చీక‌టి.. చెవిటి వాడిగా దెయ్యాల ముందు వెన్నెల కిషోర్ చేసిన కామెడీ క‌డుపులు చెక్క‌లు చేస్తుంది. ఈ పాత్ర‌లో ర‌ప్ఫాడించాడు వెన్నెల కిషోర్. సెకండాఫ్ లో ఈయ‌న చేసిన కామెడీనే సినిమా రేంజ్ ను పెంచేసింది. అంతేకాదు.. స్టార్ హీరోలు కూడా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ వెన్నెల కిషోర్ కామెడీ కోరుకుంటున్నారు. ఈయ‌న దెబ్బ‌కు అంతో ఇంతో ఉన్న బ్ర‌హ్మానందం పూర్తిగా ఖాళీ అయిపోయాడు. మొత్తానికి టైమ్ అంటే ఇదే క‌దా..! కిషోర్ కెరీర్ లో వెన్నెల వెలిగిపోతుందిప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here