వ‌రుణ్ కూడా చిందేసాడండోయ్..!

Tholi Prema
ఒక్కోసారి మ‌నం చూడ‌లేనిది చూసిన‌పుడు ఆశ్చ‌ర్యంగా ఉంటుంది. ఇప్పుడు ప్రేక్ష‌కుల‌కు వ‌రుణ్ తేజ్ కూడా ఇలాంటి షాకే ఇచ్చాడు. ఈయ‌న న‌టించిన తొలిప్రేమ‌పై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 9న ఈ చిత్రం విడుద‌ల కానుంది. వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ డాన్సులు కూడా కుమ్మేసాడు. ఇదే ఇప్పుడు అభిమానుల‌కు సూప‌ర్ షాక్ ఇస్తుంది. అస‌లు వ‌రుణ్ తేజ్ డాన్సులు చేయ‌డం ఏంటి అంటున్నారు ఫ్యాన్స్. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలోనూ ఈయ‌న డాన్సులు వేయ‌లేదు. బాబాయ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాదిరే డాన్సుల‌కు దూరంగా ఉంటాడు వ‌రుణ్ తేజ్ కూడా. కానీ ఇప్పుడు అభిమానుల మ‌న‌సు గెల‌వాలంటే డాన్సులు వేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని తెలుసుకున్నాడు ఈ హీరో. అందుకే ఇప్పుడు తొలిప్రేమ‌లో.. పైగా బాబాయ్ పేరు పెట్టుకున్న సినిమాలోనే డాన్సులు చించేసాడు ఈ కుర్ర హీరో. మిగిలిన వాళ్ల‌తో పోలిస్తే వ‌రుణ్ అంత బాగా చేయ‌లేడు కానీ త‌న‌కు వ‌చ్చిన దాంట్లోనే చాలా క‌ష్ట‌ప‌డ్డాడు ఈ మెగా హీరో.
ఆరున్న‌ర అడుగుల క‌టౌట్ తో మ‌నోడు స్టెప్పులేస్తుంటే చూడ్డానికి ఆక‌ట్టుకునేలా ఉండ‌దు. అందుకే బాబాయ్ లా అలా అలా న‌డిపిస్తుంటాడు ఈ కుర్ర హీరో. కానీ ఇప్పుడు తొలిప్రేమ కోసం ఒళ్లొంచాడు వ‌రుణ్ తేజ్. శేఖ‌ర్ మాస్ట‌ర్ జోడీతో క‌లిసి మంచి స్టెప్పులు వేసాడు. కాలు క‌దిపాడు.. చెమ‌ట చిందించాడు. అల‌వాటు లేని క‌ష్ట‌మైన స్టెప్పులు కూడా బాగానే వేసాడు మెగా ప్రిన్స్. ఈ డాన్సులు చూసిన త‌ర్వాత ఫ్యాన్స్ అయితే క‌చ్చితంగా ఫిదా అయిపోతారేమో..? ఇప్ప‌ట్నుంచీ ప్ర‌తీ సినిమాలో త‌న‌కు వ‌చ్చినంత‌గా డాన్సులు వేస్తానంటున్నాడు వ‌రుణ్ తేజ్. పైగా తాను బ‌న్నీ, చ‌ర‌ణ్ లాంటి డాన్స‌ర్ ను కాద‌ని.. వ‌చ్చిన‌ట్లు వేస్తుంటాను.. క్ష‌మించండి అంటూ అభిమానుల‌కు చెప్పుకున్నాడు కూడా ఈ మెగా రాజ‌కుమారుడు. మొత్తానికి ఏదో అలా న‌డ‌వ‌కుండా.. మిగిలిన వాళ్ల‌లా స్టెప్పులేయ‌డానికి ప్ర‌య‌త్నాలైతే చేస్తున్నాడు క‌దా.. అది చాలు అంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here