వ‌రుణ్ గాల్లో తేలిపోతున్నాడు.. 

ఫిదా విజ‌యం సాధించింద‌నో.. ఇప్పుడు తొలిప్రేమ‌పై భారీ అంచ‌నాలున్నాయ‌నో కాదు.. వ‌రుణ్ తేజ్ మ‌రో కార‌ణంతో గాల్లో తేలిపోనున్నాడు. ఈ కుర్ర హీరో ప్ర‌స్తుతం వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఫిదా స‌క్సెస్ త‌ర్వాత వ‌రుణ్ తేజ్ మార్కెట్ కూడా బాగానే పెరిగింది. మ‌నోడితో ఏకంగా 25 కోట్ల సినిమాను తీయ‌డానికి కూడా ముందుకొస్తున్నారు నిర్మాత‌లు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. ఈ కుర్ర హీరో ఏకంగా పాతిక కోట్ల బ‌డ్జెట్ ఉన్న సినిమాలో హీరోగా న‌టించ‌బోతున్నాడు. అది కూడా ఘాజీ లాంటి సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించిన సంక‌ల్ప్ రెడ్డితో. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా వ‌స్తుంద‌ని చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నా.. ఇప్ప‌టికి అవి క‌న్ఫ‌ర్మ్ అయ్యాయి. త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేయ‌బోతు న్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఘాజీ కుర్రాడు చెప్పిన క‌థ‌కు వ‌రుణ్ బాగా ఇంప్రెస్ అయ్యాడ‌ని తెలుస్తోంది. పివిపి ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాడు. ఆయ‌న‌తో క‌లిసి మ్యాట్ని కూడా ఓ చేయి వేయ‌నుంది. ఘాజీని కూడా వీళ్లే నిర్మించారు. ఇప్పుడు మ‌రోసారి ఈ ఇద్ద‌రూ సంయుక్తంగా వ‌రుణ్ తేజ్ సినిమా నిర్మించ‌బోతున్నారు. ఈ చిత్రం సైన్స్ ఫిక్ష‌న్ అని.. స్పేస్ నేప‌థ్యంలో తెర‌కెక్కే సినిమా అంటున్నారు. ఇలాంటి క‌థ‌తో ఇప్పుడు త‌మిళ‌నాట టిక్ టిక్ టిక్ అనే సినిమా వ‌స్తుంది. ఇప్పుడు తెలుగులో మ‌రో సినిమా ఇలాంటిదే వ‌స్తుండ‌టం విశేషం. తొలి సినిమాతోనే ఇండియా వ్యాప్తంగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు వ‌రుణ్ తేజ్ తో క‌లిసి ఏం చేస్తాడో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here