వ‌రుణ్ తేజ్ ప్రేమ‌లో ప‌డ్డ దిల్ రాజు..


ఏంటీ ప్ర‌కృతి వైప‌రిత్యం అనుకుంటున్నారా..? అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇప్పుడు ఇదే నిజం. అప్ప‌ట్లో సాయిధ‌రంతేజ్ తో వ‌ర‌స‌గా సినిమాలు చేసిన దిల్ రాజు.. ఇప్పుడు వ‌రుణ్ తేజ్ ను ప‌ట్టుకున్నాడు. ఆయ‌న‌తోనే వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్నాడు. ఛాన్స్ లేక‌పోతే వ‌ర‌స‌గా ఆయ‌న న‌టిస్తోన్న సినిమాలు కొనేస్తున్నాడు. ఫిదాతో వ‌రుణ్ తేజ్ కు పెద్ద విజ‌యం అందించాడు దిల్ రాజు. ఈ సినిమా త‌ర్వాత మొన్న వ‌రుణ్ తేజ్ న‌టించిన తొలిప్రేమను కూడా రాజుగారే కొన్నారు. ఇది కూడా సూప‌ర్ హిట్ అయింది. ఇకిప్పుడు మ‌రోసారి అదే చేయ‌బోతున్నాడు దిల్ రాజు. త్వ‌ర‌లో సంకల్ప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో క్రిష్ నిర్మాత‌గా ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమా స్పేస్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. దీనికోసం క‌జ‌కిస్థాన్ వెళ్తున్నాడు వ‌రుణ్ తేజ్. దానికోసం మూడు నెల‌ల పాటు జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు వ‌రుణ్.
క్రిష్-సంక‌ల్ప్ సినిమా ఎలా ఉంటుందో తెలియ‌కుండానే 20 కోట్ల‌కు బేరం పెట్టాడు దిల్ రాజు. సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతో ముందు గానే కొనేస్తున్నాడు. త‌ర్వాత క‌చ్చితంగా రేట్ పెరుగుతుంద‌ని ముందే తెలుసుకుని తెలివిగా గేమ్ ఆడుతున్నారు రాజు గారు. మే నుంచి ఈ చిత్ర షూటింగ్ మొద‌లుకానుంది. ఈ చిత్రంతో పాటు అనిల్ రావిపూడితోనూ ఓ సినిమా చేయ‌బోతున్నాడు వ‌రుణ్ తేజ్. దీనికి కూడా దిల్ రాజే నిర్మాత‌. దీనికి ఎఫ్ 2 అనే ఆస‌క్తిక‌రమైన‌ టైటిల్ కూడా పెట్టాడు. అంటే ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ అన్న‌మాట‌. మొత్తానికి ఫిదాతో వ‌రుణ్ తేజ్ ను స్టార్ గా మార్చిన దిల్ రాజు.. ఆయ‌న‌తోనే వ‌ర‌స సినిమాలు క‌మిట్ అవుతున్నాడు.. కొంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here