వ‌రుణ్ పాట యూ ట్యూబ్ ను కుమ్మేస్తుంది..


వ‌రుణ్ అంటే మ‌న వ‌రుణ్ తేజ్ కాదు.. బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్. ఈ మ‌ధ్య యూ ట్యూబ్ లో సినిమా పాట‌ల కంటే కూడా ప్రైవేట్ సాంగ్స్ కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఆ మ‌ధ్య హృతిక్ రోష‌న్, సోన‌మ్ క‌పూర్ చేసిన ఆషికి సాంగ్ ను ఏకంగా 100 కోట్ల మంది చూసారంటే సీన్ అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు కూడా ఇలాంటి మ్యాజిక్ జ‌రుగుతుంది. వ‌రుణ్ ధావ‌న్, శ్ర‌ద్ధాక‌పూర్ జంట‌గా న‌వాబ్ జాదే అంటూ ఓ ప్రైవేట్ సాంగ్ విడుద‌ల చేసారు.
ఈ పాట‌లో శ్ర‌ద్ధాక‌పూర్ బాగా శ్ర‌ద్ధ‌గా అందాల‌న్నీ ఆర‌బోసింది. ఇదే పాట‌లో బాలీవుడ్ కొరియోగ్ర‌ఫ‌ర్స్ కూడా ఉన్నారు. దానికితోడు స్లో మోష‌న్ డాన్స్ స్పెష‌లిస్ట్.. డాన్స్ ప్ల‌స్ హోస్ట్ అయిన రాఘ‌వ్ కూడా ఉన్నాడు. హై రేటెడ్ గుబ్రు అంటూ సాగే ఈ పాట‌కు ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. ఒక‌టి రెండు కాదు.. ఆరు రోజుల్లోనే 4 కోట్ల వ్యూస్ వ‌చ్చాయి. ఇంకా ఇప్ప‌టికీ ట్రెండింగ్ లోనే ఉంది ఈ పాట‌. వ‌రుణ్ ధావ‌న్ డాన్స్ కు తోడు శ్ర‌ద్ధా అందాల‌తో హై రేటెడ్ సాంగ్ కు హై క్లిక్కింగ్స్ వ‌స్తున్నాయి. మ‌రికొన్ని రోజుల్లో ఈ పాట ఇంకా పిచ్చెక్కించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here