వ‌ర్మ పిచ్చికి బ‌లైపోతున్న నాగార్జున‌.. 

Nagarjuna YSR
త‌ప్పులు రెండు ర‌కాలుంటాయి.. తెలిసి చేయ‌డం.. తెలియ‌కుండా చేయ‌డం. కానీ తెలిసి చేసినా.. తెలియ‌కుండా చేసినా త‌ప్పు త‌ప్పే. దానికి శిక్ష త‌ప్ప‌దు. ఇప్పుడు వ‌ర్మ విష‌యంలో నాగార్జున చేసింది ఇదే. అందుకే ఇప్పుడు శిక్ష అనుభ‌విస్తున్నాడు. వ‌ర్మ‌కు ఛాన్స్ ఇవ్వ‌డ‌మే ఇప్పుడు నాగార్జున చేసిన త‌ప్పు. అదేంటి అనుకుంటున్నారా..? అంతే క‌దా మ‌రి.. పాత స్నేహితుడు, క‌థ బాగా చెప్పాడు క‌దా అని అవ‌కాశం ఇస్తే.. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటూ ఇప్పుడు పోలీసుల వెంట తిరుగుతున్నాడు వ‌ర్మ‌. ఈయ‌న‌కు కాఫీ అంటే ఎంత పిచ్చో.. పోర్న్ అంటే కూడా అంతే. ఆ పిచ్చినే ఇప్పుడు పోలీసుల ద‌గ్గ‌ర కూడా చూపించాడు. వాళ్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు పిచ్చి పిచ్చి స‌మాధానాలిచ్చి వాళ్ల‌కు కూడా పిచ్చి లేపాడు ఈ ద‌ర్శ‌క దిగ్గ‌జం.
ఈయ‌న వీక్ నెస్ తెలుసుకుని ఓ బ‌డా ఛానెల్ ఆయ‌న్ని మాట్లాడితే పిలుస్తుంటుంది. వ‌ర్మ మేధావే.. కాద‌న‌లేం. ఎందుకంటే ఆయ‌న ద‌గ్గ‌ర ఓ థియ‌రీ ఉంటుంది. ప్ర‌పంచంలో ఏ ప్ర‌శ్న అడిగినా త‌డుముకోకుండా స‌మాధానం చెప్ప‌డం వ‌ర్మ ప్ర‌త్యేక‌థ‌. ఆయ‌న్ని ఇరుకున పెట్ట‌డం అంటే మ‌నం ఇరుకున ప‌డ‌ట‌మే. ప్ర‌తీ ప్ర‌శ్న‌కు స‌మాధానంతో పాటు కౌంట‌ర్ కూడా సిద్ధం చేసుకునే వ‌స్తాడు వ‌ర్మ‌. మొన్న క‌డ‌ప వెబ్ సిరీస్.. నిన్న గాడ్ సెక్స్ అండ్ ట్రూత్.. ఇలా ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తున్నాడు వ‌ర్మ‌. నాగార్జున సినిమా మొద‌లైన త‌ర్వాత మ‌రే దానిపై ఫోక‌స్ పెట్ట‌న‌ని చెప్పిన వ‌ర్మ‌.. ఇప్పుడు నాగ్ సినిమాపై త‌ప్ప అన్నింటిపై ఫోక‌స్ పెడుతున్నాడు.
ఈయ‌న ఏదైనా చేయ‌ని.. కానీ ఈయ‌న వ‌ల్ల ప‌క్క‌వాళ్లు డిస్ట‌ర్బ్ అవ్వ‌కూడ‌దు క‌దా..! కానీ ఇప్పుడు నాగార్జున స‌ఫ‌ర్ అవుతున్నాడు. తెలిసి తెలిసి మ‌రీ న‌ష్ట‌పోతున్నాడు నాగార్జున‌. ఎందుకంటే స్టార్ హీరోలెవ‌రూ క‌నీసం వ‌ర్మ వైపు చూడ్డానికి కూడా సాహ‌సించ‌ని టైమ్ లో నాగార్జున ఈ ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చాడు. ఇచ్చే ముందే చెప్పాడు కూడా వ‌ర్మ చాలా తేడా. అత‌డిపై పూర్తి న‌మ్మ‌కం వ‌చ్చిన త‌ర్వాతే ఇస్తాన‌ని. నిజంగానే మారిపోయాడ‌నుకుని నాగార్జున కూడా న‌మ్మేసాడు పాపం..! కానీ వ‌ర్మ మార్పు అనేది ఆకాశంలో మేఘం లాంటిది. వ‌ర్షం వ‌స్తే అది కూడా మారిపోతుంది. ఇక్క‌డ వ‌ర్మ మ‌న‌సు కూడా అంతే.
త‌న సినిమా చేస్తూ మ‌రో సినిమా చేస్తే ఒప్పుకోన‌ని ముందే చెప్పాడు నాగార్జున‌. అలా చేయ‌కుండా ఉండ‌టం వ‌ర్మ‌కు చాలా క‌ష్ట‌మైన ప‌ని అని నాగార్జున‌కు తెలుసు. ఇప్పుడదే నిరూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఓ వైపు నాగ్ సినిమా సెట్స్ పై ఉండ‌గానే సెక్స్ సినిమాలు చేస్తున్నాడు వ‌ర్మ‌. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటాడు.. ఇంకోసారేమో క‌డప వెబ్ సిరీస్ అంటాడు.. ఇప్పుడేమో పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ మ‌ధ్య‌లో త‌న సినిమా ఏమైపోతుందో అని పాపం ఫీల్ అవుతున్నాడు నాగార్జున. ఓ సినిమా మొద‌లుపెట్టి.. మ‌ధ్య‌లో మ‌రోటి తీసుకొచ్చి ముందు సినిమాను గాలికొదిలేసిన సంద‌ర్భాలు బోలెడున్నాయి. సాక్షాత్తు చిరంజీవికే దీనికి సాక్ష్యం. అందుకే వ‌ర్మ‌ను ముందుగానే కంట్రోల్లో పెట్టాల‌నుకున్నాడు నాగార్జున‌. కానీ అలా జ‌ర‌గ‌డం లేదు. మ‌రోసారి వ‌ర్మ పాత రూట్ లోనే వెళ్తున్నాడు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. వ‌ర్మ చేస్తోన్న ఈ ప‌నులు నాగార్జున సినిమాను ఎటువైపు వెళ్ల‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here