శంక‌ర్ అర్ధ‌రాత్రి సంచ‌ల‌నం..


ప్ర‌పంచం ప‌డుకున్న‌పుడు నిద్ర లేచాడు శంక‌ర్. ఈయ‌నపై ర‌జినీ అభిమానులు ఇప్పుడు కోపంగా ఉన్నారు. త‌మ హీరోకు అప్ప‌ట్లో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇచ్చాడ‌నే విష‌యం కూడా మ‌రిచిపోయి శంక‌ర్ పై గుర్రుగా ఉన్నారు ఫ్యాన్స్. 2.0 సినిమా విడుద‌ల చేయ‌కుండా ఆల‌స్యం చేస్తున్నాడ‌ని ఈ కోప‌మంతా.
అయితే ఇప్పుడు ఈ కోపం తీరిపోయే మార్గం దొరికింది. ఎందుకంటే 2.0 విడుద‌ల తేదీ అనౌన్స్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. న‌వంబ‌ర్ 29న 2.0 రావ‌డం ఖాయం అని తేల్చేసాడు శంక‌ర్. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కంపెనీ కూడా మాటివ్వ‌డంతో ధైర్యంగా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాడు శంక‌ర్. అస‌లు 2018 లో రాదేమో అనుకున్న సినిమా కాస్తా ఇప్పుడు వ‌స్తుండ‌టంతో పండ‌గ చేసుకుంటున్నారు ప్రేక్ష‌కులు. 450 కోట్ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం విష‌యంలో శంక‌ర్ చూపిస్తున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.
ఆడియో విడుద‌లైన 8 నెల‌ల త‌ర్వాత విడుద‌ల తేదీ అనౌన్స్ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. నిన్న‌టి వ‌ర‌కు కూడా అన్నీ వ‌దిలేసి భార‌తీయుడు 2పై బిజీ బిజీగా ఉన్నాడు శంక‌ర్. ఇక ర‌జినీ కూడా అన్నీ వ‌దిలేసి మిగిలిన సినిమాల‌తో బిజీ అయిపోయాడు. మ‌రి 2.0 ఎక్క‌డికి వెళ్లిన‌ట్లు..? అంటూ అభి మానులు బాగానే తిట్టుకున్నారు. ఇప్పుడు వీళ్లంద‌రి ఊహ‌ల‌కు స‌మాధానం చెబుతూ న‌వంబ‌ర్ 29 అనేసాడు శంక‌ర్. ఇప్ప‌టికే బ‌య్య‌ర్లు కూడా భ‌య‌ప‌డుతున్నారు. ఇంత మొత్తం తిరిగి వ‌స్తుందా రాదా అని వ‌ణికిపోతున్నారు వాళ్లు. మ‌రి వాళ్ళ న‌మ్మ‌కాన్ని 2.0 ఎంత‌వ‌ర‌కు నిల‌బెడుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here