శంభో శంక‌రా ట్రైల‌ర్.. ప‌వ‌న్ డూప్..!

SHAKALAKA SHANKAR

క‌మెడియ‌న్లు హీరోలుగా మార‌డం ఎప్ప‌ట్నుంచో వ‌స్తున్న ఆన‌వాయితీ. కానీ హీరోగా మారాలంటే ముందు స్టార్ క‌మెడియ‌న్ అయ్యుండాలి. అప్పుడే క‌నీసం ఆయన్ని చూడ్డానికి ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కు వ‌స్తారు. కానీ స్టార్ క‌మెడియ‌న్ అనే మాట రాక‌ముందే జ‌స్ట్ జ‌బ‌ర్ద‌స్థ్ షోతో పాపుల‌ర్ అయి వెంట‌నే హీరోగా న‌టించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఇప్పుడు శంక‌ర్ ఇదే చేస్తున్నాడు..

శంక‌ర్ అంటే అంద‌రూ గుర్తుప‌ట్ట‌రు కానీ శ‌క‌ల‌క శంకర్ అంటే మాత్రం గుర్తు ప‌డ‌తారు. ప‌వ‌న్ అభిమానిగా.. కాదు కాదు భ‌క్తుడిగా అంద‌రికీ ప‌రిచ‌యం ఈ క‌మెడియ‌న్. ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ స్టేట‌స్ అయితే రాలేదు కానీ.. అదేం విచిత్రమో హీరోగా మాత్రం ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఒక‌టి కాదు రెండు సినిమాల్లో హీరోగా న‌టిస్తున్నాడు శంక‌ర్. ప్ర‌స్తుతం త‌న తోటి జ‌బ‌ర్ద‌స్థ్ క‌మెడియ‌న్ శ్రీ‌ధ‌ర్ ఎన్ ద‌ర్శ‌కుడిగా మారి శంక‌ర్ తోనే శంభో శంక‌రా సినిమా చేస్తున్నాడు. సురేష్ కొండేటి ఈ చిత్రానికి నిర్మాత‌. ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల అయిందిప్పుడు.

ఇందులో చెప్పుకోడానికి కొత్త క‌థేం లేదు కానీ ఈయ‌న మాత్రం పూర్తిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఇమిటేట్ చేసాడు. పైగా మెడ‌లో ఎర్ర ట‌వ‌ల్ వేసుకుని ప‌వ‌న్ భ‌జ‌న చేసేసాడు. ఈ సినిమా జూన్ 29న విడుద‌ల కానుంది. ఈ చిత్రంతో పాటే డ్రైవ‌ర్ రాముడు అంటూ మ‌రో సినిమా కూడా చేస్తున్నాడు ఈ క‌మెడియ‌న్. మ‌రి చూడాలిక‌.. శ్రీ‌కాకుళం యాస‌లో శంక‌ర్ మాట్లాడే మాట‌లు ఈ రెండు సినిమాల‌కు ఎంత వ‌ర‌కు హెల్ప్ అవుతాయో.. అస‌లు హీరోగా స‌క్సెస్ అవుతాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here