శృతిహాస‌న్ ఆడుకుంటుందా..?

SHRUTHI HASAN NANI

అదేంటి స‌డ‌న్ గా అంత మాట అనేసారేంటి అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ఇదే అనిపిస్తుంది మ‌రి. అమ్మ‌డు తీరు చూస్తుంటే అస‌లు సినిమాలు చేయాల‌ని ఉందా లేదా అనేది తేల్చుకోడానికి కూడా క‌ష్టంగా మారింది. ఓ సారి చేస్తానంటుంది.. మ‌రోసారి సారీ చేయ‌నంటోంది. అస‌లు శృతి ఆలోచ‌న ముందు ఏ ద‌ర్శ‌కుడు కూడా నిల‌బ‌డ‌లేక‌పోతున్నాడు. అందుకే ఈమెను అడ‌గ‌డం కూడా మానేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక ఆమెతో ప‌నిలేదు.. అనుకుంటున్న టైమ్ లో మ‌ళ్లీ శృతిహాస‌న్ సినిమాలు చేస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు కూడా ఇంతే. మొన్న‌టి వ‌ర‌కు ర‌వితేజ‌తో క‌లిసి న‌టించ‌బోతుంద‌నే వార్త‌లొచ్చాయి. ఇప్పుడు నాని సినిమాలో న‌టిస్తుంద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్యే గౌత‌మ్ తిన్ననూరితో నాని క‌మిటైన జెర్సీ సినిమాలో హీరోయిన్ గా శృతిహాస‌న్ ను అనుకుంటున్నార‌నే ప్ర‌చారం బాగానే జ‌రుగుతుంది. మ‌రోవైపు శృతి కూడా ఎప్పుడు ఏ హీరోతో ఓకే చెబుతుందో తెలియ‌దు. స్టార్ హీరోల‌తో ఆఫ‌ర్లు వ‌స్తున్నా కూడా స‌డ‌న్ గా చిన్నోళ్ల‌తో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. గ‌తంలోనూ ఇదే చేసింది. ఇక ఇప్పుడు ఇదే చేయ‌ద‌ని గ్యారెంటీ కూడా లేదు.

పైగా మొన్న‌టి వ‌ర‌కు బొద్దుగా క‌నిపించిన శృతి.. ఇప్పుడు అందాల‌ను బాగానే శృతి చేసింది. స‌న్న‌గా మారిపోయింది. ఓ షాపింగ్ మాల్ యాడ్ కోసం చేసిన ఫోటోషూట్ లో నాజూగ్గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇది చూసి కుర్రాళ్లు కూడా ఓహో శృతి బాగానే చేసిందిగా అందాల‌కు అంటూ క‌మెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ లో విద్యుత్ జ‌మాల్ తో ఓ సినిమా ఒప్పుకున్న ఈ భామ‌.. ఇప్పుడు ఇక తెలుగులోనూ న‌టించ‌డానికి సై అంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ క్రేజీ కాంబినేష‌న్ మ‌రోసారి వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here