శృతిహాస‌న్.. ది న్యూ రాక్ స్టార్..!

ఇప్పుడు ఈ భామ‌ను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది. ఎందుకంటే సినిమాలు ఆపేసి ఎంచ‌క్కా మ్యూజిక్ పై దృష్టి పెట్టింది శృతి. అక్క‌డ శృతి క‌లుపుతుంది కూడా. ఈ మ‌ధ్య కాలంలో సినిమాల‌కు పూర్తిగా దూరమైన శృతి.. ఫిజిక్ పై కూడా ప‌ట్టు కోల్పోయింది. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ఫిజిక్ పై దృష్టిపెట్టింది ఈ భామ‌. దాంతో షేప్ ల‌తో షేకుల‌తో షాకులిస్తుంది. ఈ మ‌ధ్య అస‌లు బ‌య‌ట క‌నిపించ‌డ‌మే మానేసిన ఈ భామ‌.. తాజాగా ఓ ఫోటోషూట్ చేసింది.
SHRUTHI-HASAN
అందులో బాగానే అందాలు ఆర‌బోసినా.. ఇప్పుడు సినిమాల కోసం కాదంటుంది. త‌న ఫోక‌స్ మొత్తం ఇప్పుడు సంగీతంపైనే ఉంద‌ని చెబుతుంది శృతిహాస‌న్. అందుకే లండ‌న్ లో కూర్చుని మ్యూజిక్ సిట్టింగ్స్ లో ప్రాక్టీస్ చేస్తుంది. త‌న ట్రూప్ తో క‌లిసి ప్రైవేట్ ఆల్బ‌మ్స్ సిద్ధం చేస్తుంది శృతిహాస‌న్. ప్ర‌స్తుతం హిందీలో విద్యుత్ జ‌మాల్ సినిమా త‌ప్ప మ‌రో సినిమా ఏది సైన్ చేయ‌లేదు ఈ ముద్దుగుమ్మ‌.
తెలుగులో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించాల‌ని కోరినా కూడా ఒప్పుకోలేదు శృతి. ప్ర‌స్తుతానికి త‌న ఫోక‌స్ అంతా సంగీత‌మే అంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రోవైపు తండ్రి రాజ‌కీయ పార్టీ ప‌నుల‌ను కూడా ద‌గ్గ‌రుండి చూసుకుంటుంది శృతి. మ‌రి ఒకేసారి ఇన్ని ప‌నుల‌ను శృతి ఎలా చ‌క్క‌బెట్టుకుంటుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here