శ్రీ‌దేవి మ‌ర‌ణం.. బోనీక‌పూర్ కార‌ణం.. 


ఇప్పుడు అంద‌రికీ ఇది కూడా అనిపిస్తుంది. లేక‌పోతే మ‌రేంటి.. నిన్న‌టి వ‌ర‌కు మ‌న మ‌ధ్యే తిరిగిన ఆమె స‌డ‌న్ గా చ‌నిపోయింది అంటే న‌మ్మ‌లేక అంతా ఆశ్చ‌ర్యంలో మునిగిపోతున్నారు. కొంద‌రైతే శ్రీ‌దేవి నార్మ‌ల్ గానే చ‌నిపోయిందా లేదంటే ఏదైనా వెన‌క మిస్ట‌రీ ఉందా అంటున్నారు. ఎందుకంటే చ‌రిత్ర‌లో ఎంతోమంది సెలెబ్రెటీస్ మ‌ర‌ణాలు చాలా మిస్టీరియ‌స్ గా మిగిలిపోయాయి. ఇప్పుడు శ్రీ‌దేవి విష‌యంలో కూడా అంతా ఓ క‌ల‌లా జ‌రిగిపోయింది. ఏం జ‌రుగుతుందో తెలుసుకునే లోపే.. తెల్లారేలోపే శ్రీ‌దేవి జీవితం కూడా తెల్లారిపోయింది. ఫిబ్ర‌వ‌రి 24 రాత్రి పెళ్లిలో బాగా ఎంజాయ్ చేసిన శ్రీ‌దేవి.. అదే రోజు రాత్రి క‌న్నుమూసింది. అది కూడా హోట‌ల్ బాత్ రూమ్ లో.
11 గంట‌ల వ‌ర‌కు పార్టీ చేసుకుని.. రూమ్ కి వ‌చ్చి ప‌డుకున్న శ్రీ‌దేవిని భ‌ర్త బోనీక‌పూర్ ఓ స‌ర్ ప్రైజ్ పార్టీ కోసం నిద్ర‌లేపాడు. భార్య‌కు స‌ర్ ప్రైజ్ పార్టీ ఒక‌టి ప్లాన్ చేసిన బోనీ.. వ‌చ్చి ఆమెను నిద్ర‌లేపి ఫ్రెష్ కావాల‌ని కోరాడు. లేచి వాష్ రూమ్ కు వెళ్లిన శ్రీ‌దేవి.. ఎంత‌సేప‌టికి బ‌య‌టికి రాక‌పోవ‌డంతో డోర్ బ‌ద్ద‌లుకొట్టి చూసాడు బోనీ క‌పూర్. కానీ అప్ప‌టికే అక్క‌డ బాత్ ట‌బ్ లో చ‌ల‌నం లేకుండా ప‌డిపోయింది శ్రీ‌దేవి. వెంట‌నే దుబాయ్ లోని ఓ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. కానీ అప్ప‌టికే ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీక‌రించారు. అప్ప‌టి వ‌ర‌కు త‌మ మ‌ధ్యే ఉన్న శ్రీ‌దేవి.. ఇక లేద‌ని తెలిసి నిర్ఘాంత పోయారు కుటుంబ స‌భ్యులు. పెళ్లి వేడుక కాస్తా విషాద వేదిక‌గా మారిపోయింది. ఇప్ప‌టికీ ఇండియాకు శ్రీ‌దేవి భౌతిక‌కాయం రాలేదు. అనిల్ అంబానీ స్పెష‌ల్ ఫ్లైట్ లో ఆమె పార్థివ దేహాన్ని తీసుకొస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here