సమ్మర్‌ స్పెషల్‌గా పూరి జగన్నాథ్‌ 'మెహబూబా'

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రానికి సందీప్‌ చౌతా సంగీతం అందిస్తున్నారు.
1971 ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రపద్రేశ్‌, యు.ఎస్‌.లలో 800కి పైగా థియేటర్స్‌లో డుదలైన ఈ చిత్రం టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. సోషల్‌ మీడియాలో ఈ టీజర్‌ చాలా పాపులర్‌ అయిపోయింది. పూరి జగన్నాథ్‌ కెరీర్‌లోనే డిఫరెంట్‌ మూవీగా రూపొందుతున్న ‘మెహబూబా’ చిత్రాన్ని సమ్మర్‌లో చాలా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఆకాష్‌ పూరి సరసన నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్‌ చౌతా, సినిమాటోగ్రఫీ: విష్ణుశర్మ, ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ, యాక్షన్‌: రియల్‌ సతీష్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.​

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here