సాక్ష్యం.. కుర్రాడు ఏం చేస్తాడో..?

BELLAMKONDA SAKSHYAM,
ఏ మాటకా మాటే..! ఈ మ‌ధ్య స్టార్ హీరోలు కూడా బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను చూసి కాస్త కుళ్లుకునే ఉంటారు. మ‌నోడు వ‌స్తున్న తీరు అలా ఉంది మ‌రి. ప్ర‌తీ సినిమాతో భారీ బ‌డ్జెట్.. దానికితోడు టెక్నీషియ‌న్స్.. స్టార్ హీరోయిన్స్.. ద‌ర్శ‌కులు.. సెట‌ప్ అంతా చూస్తుంటే బాపురే అనిపిస్తుంది. ఇక ఇప్పుడు సాక్ష్యం కూడా అంతే. దీనికి మిన‌హాయింపేమీ కాదు. ఈ చిత్రంలో కూడా స్టార్ క్యాస్ట్ కు ఏ మాత్రం లోటులేదు.
ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ కూడా అదిరిపోయింది. విజువ‌ల్ వండ‌ర్ అనే మాట‌కు త‌క్కువేం కాదు. శ్రీ‌వాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రంజులై 27న వ‌స్తుంది. అయితే సినిమాకు ప్రాణంగా ఉండే యుఎస్ ప్రీమియ‌ర్స్ మాత్రం లేవు. కంటెంట్ ఆల‌స్యంగా రావ‌డ‌మే దీనికి కార‌ణం.
ఈ చిత్ర క‌థ పంచ‌భూతాల చుట్టూ తిరుగుతుంది. ఇందులో హీరో త‌న వాళ్ల‌ను చంపిన వాళ్ల‌పై ప‌గ తీర్చుకుంటాడు. అదెలా అనేది క‌థ‌. కొన్ని అతీత శ‌క్తులు ఈ కుర్రాడికి అండ‌గా ఉంటాయి. పంచ‌భూతాలే అన్నింటికీ సాక్ష్యం అనేది ఈ చిత్ర కాన్సెప్ట్. దీనికి త‌గ్గ‌ట్లే సినిమాలో చాలా విఎఫ్ఎక్స్ వ‌ర్క్ ఉంది. బాహుబ‌లి సినిమాకు ప‌ని చేసిన టీం సాక్ష్యంకు ప‌నిచేసారు. ఇందులో బెల్లంకొండ‌కు జోడీగా పూజాహెగ్డే న‌టించింది.
భారీ బ‌డ్జెట్ తో అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ సాక్ష్యంను నిర్మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు కెరీర్ లో స‌రైన హిట్ లేని బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఈ సాక్ష్యంతో స‌త్తా చూపించాల‌ని చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని 25 కోట్లకు అమ్మారు. బ‌డ్జెట్ కంటే ప‌ది కోట్లు త‌క్కువ‌కే సినిమా బిజినెస్ చేయ‌డం గ‌మ‌నార్హం. అల్లుడు శీను, జ‌య జానకీ నాయ‌కాకు కూడా ఇలాగే చేసారు. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? ఈ సారైనా సాక్ష్యంతో హిట్ కొడ‌తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here