సామి 2.. ర‌చ్చ మొద‌లైంది..!


విక్ర‌మ్ సామి 2 ప్ర‌మోష‌న్ మొద‌లైపోయింది. ఈ చిత్రంలోని పాట‌లు ఒక్కొక్క‌టిగా విడుద‌ల‌వుతున్నాయి. ఇప్పుడు ఆడియో కూడా వ‌చ్చేసింది. ఇక దాంతోపాటే బోన‌స్ గా విక్ర‌మ్, కీర్తిసురేష్ పాడిన పాట ఒక‌టి విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. స్టూడియోలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ విక్ర‌మ్, కీర్తి పోటీ ప‌డుతూ పాట పాడారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ పాట‌ను రాయ‌డం మ‌రో స్పెషాలిటీ. తెలుగులోనే కాదు..
త‌మిళ్ లోనూ కవిగా మారిపోయాడు దేవీ. అంతేకాదు.. స్వ‌యంగా విక్ర‌మ్, కీర్తితో పాడించ‌డంతో ఈ మాస్ సాంగ్ పై అంచ‌నాలు పెరిగిపోయాయి. విన‌డానికి సూప‌ర్ క్యాచీగా ఉన్న ఈ పాట రేపు థియేట‌ర్స్ లోనూ ఇదే రేంజ్ లో కుమ్మేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. త్వ‌ర‌లోనే సామి స్క్వేర్ విడుద‌ల కానుంది. హ‌రి దీనికి ద‌ర్శ‌కుడు.
పోలీస్ క‌థ‌లు రాసి రాసి అన్నీ ఒకేలా తీస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ ఎన్ని చేసినా మ‌ళ్లీ ఈయ‌న సినిమాల్లో స్క్రీన్ ప్లే మాయ న‌డుస్తుంది. ఆ స్క్రీన్ ప్లేతోనే ఒకే క‌థ‌ను ఎన్నిసార్లైనా చూసేలా తీస్తాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు సామి స్క్వేర్ కూడా ఇదే.
14 ఏళ్ల కింద వ‌చ్చిన సామి సినిమాకు సీక్వెల్ ఇది. ట్రైల‌ర్ చూడ‌గానే ఇది సింగం సిరీస్ సినిమా అని అర్థ‌మైంది. దానికి త‌గ్గ‌ట్లే సింగం 4 కోసం రాసుకున్న క‌థ‌నే సామి 2గా తీసాన‌ని ఈ మ‌ధ్యే చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. య‌ముడులో సూర్య‌, ప్ర‌కాశ్ రాజ్ సీక్వెన్స్ మాదిరే.. ఇప్పుడు విక్ర‌మ్, బాబీసింహా మ‌ధ్య ర‌చ్చ న‌డుస్తుంది. కీర్తిసురేష్, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. క‌నీసం హ‌రి అయినా విక్ర‌మ్ గోడు విని సామి స్క్వేర్ తో స‌క్సెస్ ఇస్తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here