సామ్రాట్ ఔట్.. షాకింగ్ ఎలిమినేష‌న్..?

SAMRAT-REDDY-BIG-BOSS
కొన్ని వారాల నుంచి బిగ్ బాస్ లో వేడి పెరిగిపోతుంది. అక్క‌డ ఎవ‌రు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో చెప్ప‌లేని ప‌రిస్థితి. శ్యామ‌ల‌.. భాను లాంటి షాకింగ్ ఎలిమినేష‌న్స్ తో ఏదైనా జ‌ర‌గొచ్చు అనేది ఇప్పుడు నిజ‌మ‌వుతుంది. అంద‌ర్నీ దాటుకుంటూ కామ‌న‌ర్ గ‌ణేష్ కేక పుట్టిస్తుంటే.. ఒక్కో సెలెబ్రెటీ బ‌య‌టికి వ‌చ్చేస్తున్నాడు.
ఇక ఈ వారం నామినేష‌న్ లిస్ట్ లో అంతా పేరున్న వాళ్ల ఉండ‌టంతో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఇప్పటి వ‌ర‌కు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం.. వ‌స్తోన్న ఓట్ల ప్ర‌కారం చూస్తుంటే అంద‌రికంటే త‌క్కువ ఓటింగ్స్ తో సామ్రాట్ రెడ్డి వెన‌క ఉన్నాడు. రెండు వారాల కింద శ్యామల ఎలిమినేష‌న్ ముందే తెలిసిపోయింది.
అది ఆమె ఫేస్ బుక్ లో పెట్టిందంటూ త‌ర్వాత వార్త‌లొచ్చాయి. అయితే కార‌ణ‌మేదైనా బిగ్ బాస్ 2 లోపాలు మాత్రం ఒక్కొక్క‌టి బ‌య‌ట‌ప‌డుతున్నాయి.
ఇక ఈ వారం కూడా ఎవ‌రు షో నుంచి బ‌య‌టికి వ‌స్తున్నార‌నే విష‌యం రెండు రోజుల ముందే లీక్ అయింది. ఈ వారం సామ్రాట్ రెడ్డికి ఓట్లు త‌క్కువ‌గా వ‌చ్చాయంటూ ఓ ఓటింగ్ లిస్ట్ బ‌య‌టికి లీక్ అయింది. అది మా టీవీ యాజ‌మాన్యం లీక్ చేసిందా.. లేదంటే అనుకోకుండా బ‌య‌టికి వ‌చ్చిందా అనేది తెలియాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఓట్ల ప్ర‌కారం చూస్తే టివి 9 దీప్తికి కోటి 40 ల‌క్ష‌లకు పైగా ఓట్లు వ‌స్తే..
తేజ‌స్వీ, రోల్ రైడా, త‌నీష్ లాంటి వాళ్లంతా సామ్రాట్ కంటే ముందున్నారు. ఇప్ప‌టి వ‌రకు తేజ‌స్వీతో క‌లిసి గేమ్ ఆడ‌టం త‌ప్ప సొంత గేమ్ ఎప్పుడూ ఆడలేద‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సామ్రాట్ కు ఈ వారం గండంగా మారింది. ఇంకా ఒక్కరోజు టైమ్ ఉంది కాబ‌ట్టి ఆలోపు సామ్రాట్ కు ఇంకా ఓట్లు వ‌స్తే సేవ్ అయ్యే అవ‌కాశం ఉంది. లేదంటే ఈ వారం మ‌రో అనుమానం లేకుండా సామ్రాట్ ప్ర‌యాణం ముగిసిపోతుంది.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here