సామ్రాట్.. తేజ‌స్వి.. ఎవ‌రు ఔట్..?


బిగ్ బాస్ 2 మొద‌లైన త‌ర్వాత ఈ వారం కోస‌మే ప్రేక్ష‌కులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌డున్నంత ఆస‌క్తి ఇప్ప‌టి వ‌ర‌కు 40 రోజుల్లో ఎప్పుడూ లేదు. ఎప్పుడెప్పుడు ఆదివారం రాత్రి 9 అవుతుందా అని జులై 22 కోసం చూస్తున్నారు ప్రేక్ష‌కులు. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇన్నాళ్లూ బిగ్ బాస్ 2లో ఒక‌రికి ఒక‌రు అంటూ అల్లుకుపోయిన జంట తేజ‌స్వి-సామ్రాట్ ఇప్పుడు విడిపోయే స‌మ‌యం వ‌చ్చేసింది.
ఇక‌పై ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక్క‌రే ఈ షోలో కొన‌సాగ‌నున్నారు. ఈ వారం ఇద్ద‌రూ సెల్ఫ్ నామినేష‌న్స్ వేసుకున్న ఈ ఇద్ద‌రూ ఇప్పుడు డేంజ‌ర్ జోన్ లోకి వ‌చ్చారు. ప్రేక్ష‌కుల ఓట్ల తీరు బ‌ట్టి చూస్తుంటే ఈ వారం సామ్రాట్ రెడ్డి బ‌య‌టికి వ‌చ్చేట్లు క‌నిపిస్తున్నాడు. ఓట్ల ప‌రంగా ఆయ‌న‌కు తేజ‌స్వికి చాలా త‌క్కువ తేడాలే ఉన్నాయి.
అయితే ఇది మూడు రోజుల కింది మాట‌. అప్ప‌టికి ఇంకా ఒక్క‌రోజు ఓటింగ్ స‌మ‌యం ఉండ‌టంతో సామ్రాట్ కూడా సేఫ్ జోన్ లోకి వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. బిగ్ బాస్ ఇంటిలో లేనిపోని గొడ‌వ‌ల‌కు కార‌ణంగా మారుతున్న తేజ‌స్విని ప్రేక్ష‌కులు బ‌య‌టికి పంపినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. మొత్తానికి చూడాలిక‌.. ఈ వారం ఎవ‌రు బ‌య‌టికి వ‌చ్చినా ఒక స్ట్రాంగ్ కంటెండ‌ర్ మాత్రం బ‌య‌టికి వ‌చ్చిన‌ట్లే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here