సాయిప‌ల్ల‌వికి ఇక‌ అది ఫిక్సైపోవ‌చ్చు.. 

Sai pallavi
హీరోయిన్లు స్టార్ ఇమేజ్ తెచ్చుకోవ‌డం అంటే అందాల ఆర‌బోత‌తోనే సాధ్యం అనుకునే కాలం ఇది. ఇప్పుడున్న ముద్దుగుమ్మ‌ల‌కు హీరోల‌ను డామినేట్ చేసేంత ఇమేజ్ మాత్రం రావ‌డం క‌ల‌లో జ‌రిగే ప‌నే. కానీ దాన్ని సాధ్యం చేస్తానంటుంది సాయిప‌ల్ల‌వి. ఈ భామ ఉంటే సినిమాకు ప్రేక్ష‌కులు క్యూ క‌డుతున్నారు. హీరోల‌తో ప‌నిలేదు.. సాయిప‌ల్ల‌వి ఉంటే చాలంటున్నారు ఆడియ‌న్స్. అంత‌గా మాయ చేస్తుంది ఈ ఫిదా పోరి. హిట్ కొట్ట‌డం గొప్ప కాదు.. వ‌చ్చిన విజ‌యాన్ని ఎలా నిల‌బెట్టుకుంటున్నాం అనేది గొప్ప‌. టాలీవుడ్ లో సాయిప‌ల్ల‌వి పేరు ఓ బ్రాండ్. ఈమె సినిమా ఒప్పుకుంటే.. క‌థ ఓకే చేసిందంటే హిట్ అనే న‌మ్మ‌కానికి వ‌చ్చేసారు నిర్మాత‌లు.
హీరోయిన్ అంటే నిండా మేక‌ప్ వేసుకుని దేవ‌త‌లా క‌నిపించాలి అనే ప‌ద్ద‌తికి ఫుల్ స్టాప్ పెట్టేసింది సాయిప‌ల్ల‌వి. ప్రేమ‌మ్ లో మ‌ల‌ర్ గా మాయ చేసిన ఈ బ్యూటీ.. ఫిదాతో అంద‌ర్నీ ఫిదా చేసింది. ఇకిప్పుడు ఎంసిఏలోనూ అమ్మాయిగారు త‌న న‌ట‌న‌తో మెప్పించారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఓ హీరోయిన్ మాయ చేయ‌డం అనేది సాధ్యం కాదు. కానీ త‌న‌కు క‌థ‌లో స్పేస్ లేక‌పోయినా.. తానే తీసుకుని అంద‌ర్నీ మాయ చేసింది సాయిప‌ల్ల‌వి. ఉన్న సీన్స్ లో నానిని కూడా డామినేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ భామ కోసం యుద్ధాలే జ‌రుగుతున్నాయి ఇండ‌స్ట్రీలో. త‌మ సినిమాలో.. కాదు త‌మ సినిమాలో అంటూ అవ‌కాశాలు ఇచ్చేస్తున్నారు.
దిల్ రాజుకు సాయిప‌ల్ల‌వి టాలెంట్ గురించి తెలిసే 3 సినిమాలు సైన్ చేయించాడు. ఇప్ప‌టికే రెండు అయిపోయాయి. త్వ‌ర‌లోనే దాగుడు మూత‌లు సినిమాలో శ‌ర్వానంద్ కు జోడీగా సాయిప‌ల్ల‌వి న‌టించ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రోసారి శ‌ర్వాతో జోడీ క‌ట్ట‌బోతుంది సాయిప‌ల్ల‌వి. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే సినిమాలోనూ సాయిప‌ల్ల‌వే హీరోయిన్. ఫిదాకు ల‌క్ష‌ల్లోనే తీసుకున్న సాయిప‌ల్ల‌వి ఇప్పుడు కోట్ల‌కు చేరిపోయింది. అందాలు ఆర‌బోయ‌దు.. ఎక్స్ పోజింగ్ కు దూరం.. ఇలాంటి డిమాండ్స్ తోనూ సాయిప‌ల్ల‌వి మ్యాజిక్ చేస్తుందంటే నిజంగా గొప్పే. ప్ర‌స్తుతం త‌మిళ్ లో నాగ‌శౌర్య‌తో క‌రు.. ధ‌నుష్ తో మారి 2.. సూర్య 36.. ఇలా సాగుతుంది సాయిప‌ల్ల‌వి దూకుడు. మ‌రో రెండేళ్ల‌లో ఈ భామ రేంజ్ మ‌రింత పెరిగిపోవ‌డం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here