సాయిప‌ల్ల‌వికి చేదు అనుభ‌వం..

SAI PALLAVI SHOCK
ఈ రోజుల్లో అమ్మాయిల‌కు ఎక్క‌డా భద్ర‌త లేదు. మామూలు అమ్మాయిల‌కే కాదు సెలెబ్రెటీల‌కు, హీరోయిన్ల‌కు కూడా ఇప్పుడు సేఫ్టీ లేదు. వాళ్ళెక్క‌డికి వెళ్లినా కూడా పోకిరీల చేష్ట‌లు మాత్రం ఉంటాయి. హీరోయిన్లకు అయితే ఇది మ‌రీ ఎక్కువ‌. ఇప్పుడు సాయిప‌ల్ల‌వికి కూడా ఇది ఎదురైంది. అస‌లే ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వివాదాల్లో ఇరుక్కుంటుంది సాయిప‌ల్ల‌వి. ఇప్పుడు అనుకోకుండా త‌నే ఇబ్బందుల్లో ప‌డింది ఈ భామ‌. ఓ అభిమాని వ‌ల్ల సాయిప‌ల్ల‌వి బాగా ఇబ్బంది ప‌డింది. ఈ భామ‌కు తెలుగుతో పాటు త‌మిళ‌నాడు, కేర‌ళ‌ల్లో కూడా సూప‌ర్ ఫాలోయింగ్ ఉంది. ఈ మ‌ధ్యే సొంతూరు కోయంబ‌త్తూర్ ఎయిర్ పోర్ట్ లో సాయిప‌ల్ల‌వికి ఓ షాక్ ఇచ్చాడు అభిమాని. ప‌ల్ల‌విని చూసి వెంట‌నే ఆమెను అడిగి ఓ సెల్ఫీకి ప్ర‌య‌త్నించాడు. అక్క‌డితో ఊరుకుంటే బాగానే ఉండేది.. కానీ ఆమె భుజంపై చేయి వేయ‌డానికి ప్ర‌య‌త్నించేస‌రికి అత‌డికి వార్నింగ్ ఇచ్చింది సాయిప‌ల్ల‌వి. దూరంగా ఉండాలంటూ చెప్పింది. సెల్ఫీ ఇచ్చి అక్క‌డ్నుంచి వెళ్లిపోయింది. అభిమానం త‌ప్పు కాదు కానీ అమ్మాయిల‌తో అభిమానం పేరుతో ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం మాత్రం క‌చ్చితంగా త‌ప్పే. ముఖ్యంగా హీరోయిన్ల‌కు ఈ తిప్ప‌లు త‌ప్ప‌డం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here