సాయి కూడా ఫిబ్ర‌వ‌రి 9.. వాట్ ఈజ్ దిస్..?  

sai dharam tej, vv vinayak, c kalyan in maskat for film shooting

ఇండ‌స్ట్రీకి ఏదో అయిపోతుంది.. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మ‌తిమ‌రుపు బాగా వ‌చ్చేసిన‌ట్లుంది.. లేక‌పోతే మ‌రేంటి మ‌రే తేదీ లేన‌ట్లు అంతా క‌లిసి ఫిబ్ర‌వ‌రి 9పైనే ప‌డుతున్నారు. ఇప్పుడు సాయిధ‌రంతేజ్ న‌టిస్తున్న వినాయ‌క్ సినిమా కూడా ఫిబ్ర‌వ‌రి 9నే వ‌స్తుందంటున్నాడు నిర్మాత సి క‌ళ్యాణ్. ఈ చిత్ర షూటింగ్ డిసెంబ‌ర్ 18 నుంచి 28 మ‌ధ్య ఒమ‌న్ లో జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ బాకీ ఉందంటున్నాడు నిర్మాత‌. ఇది పూర్తైపోతే సినిమా సిద్ధ‌మ‌వుతుంద‌ని.. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఫిబ్ర‌వ‌రి 9న సాయి సినిమాను విడ‌ద‌ల చేస్తామంటున్నాడు ఈయ‌న‌. దీనికి టైటిల్ నిర్ణ‌యించ‌లేదు కానీ ధ‌ర్మాభాయ్ అనేది మాత్రం ప‌రిశీల‌న‌లో ఉంది. ఖైదీ నెం.150 త‌ర్వాత ఆర్నెళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు సాయిధ‌రంతేజ్ సినిమా చేస్తున్నాడు వినాయ‌క్. ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి యాక్ష‌న్ కామెడీగా తెర‌కెక్కిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.
ఆకుల శివ రాసిన క‌థ‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్.. స‌త్యానంద్ త‌మ‌దైన శైలిలో మాట‌లు అందించారు. ఇక ఇప్పుడు అంద‌ర్లోనూ ఒక‌టే అనుమానం.. ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుందా అని..? దీనికి ఓ స‌మాధానం కూడా తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయిధ‌రంతేజ్ మాటలతో ప‌డేసే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దీనికి మొద‌ట్లో దుర్గ అనే టైటిల్ ప్రచారంలోకి వ‌చ్చినా.. ఆ త‌ర్వాత చిరంజీవి పాత టైటిల్ కోత‌ల‌రాయుడు అనుకున్నారు.. ఆ వెంట‌నే ఇంట‌లిజెంట్ అన్నారు.. కానీ ఇప్పుడు మ‌రో ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ బ‌య‌టికి వ‌చ్చింది. అదే ధ‌ర్మాభాయ్. లావ‌ణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. అస‌లే వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న లావ‌ణ్య‌.. సాయిధ‌రంతేజ్ కు వినాయ‌క్ సినిమా వ‌రంగా మారింది. చూడాలిక‌.. ఈ సినిమాతో వాళ్ల కెరీర్ గాడిన ప‌డుతుందో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here