సావిత్ర‌మ్మ దెబ్బ‌కు చిరంజీవి ఔట్..


సావిత్రి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ లెక్క వేయాలంటే ఏ కొల‌మానం చాల‌దు. అప్ప‌ట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో స‌మానంగా క్రేజ్ సంపాదించుకున్న న‌టి సావిత్రి. ఆమె చ‌నిపోయి దాదాపు 40 ఏళ్ల‌వుతుంది. ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల్లో సావిత్ర‌మ్మ‌పై ఉన్న ప్రేమ.. అభిమానం ఇంత కూడా త‌గ్గ‌లేదు. కాక‌పోతే ఇన్నాళ్లూ చూపించుకునే దారి దొర‌క‌లేదంతే. ఇప్ప‌డు దొరికింది.. చూపిస్తున్నారు. అదే మ‌హాన‌టి రూపంలో.
ఈ చిత్రానికి వస్తున్న వ‌సూళ్ల లెక్క చూసి అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ లో అయితే సినిమా ర‌చ్చ మామూలుగా లేదు. అక్క‌డ ఇప్ప‌టికే చాలా రికార్డులు తిర‌గ రాసిన ఈ చిత్రం.. ఇప్పుడు చిరంజీవి రికార్డును సైతం ప‌క్క‌న‌బెట్టేసింది. ఖైదీ నెం.150 పేరు మీదున్న 2.4 మిలియ‌న్ రికార్డును సావిత్రి దాటేసింది. ఈ చిత్రం ఇప్పుడు 2.5 మిలియ‌న్ మార్క్ అందుకుంది.
తెలుగులో టాప్ 6 సినిమాగా నిలిచింది. మ‌హాన‌టి కంటే ముందు బాహుబ‌లి 1,2.. రంగ‌స్థ‌లం.. భ‌ర‌త్ అనే నేను.. శ్రీ‌మంతుడు మాత్ర‌మే ఉన్నాయి. ఆరోస్థానంలో స‌గ‌ర్వంగా నిలిచింది మ‌హాన‌టి. నాలుగో వారాంతంలోనూ మ‌హాన‌టి క‌చ్చితంగా త‌న ప్ర‌భావం చూపించేలా ఉంది. మ‌రి చూడాలిక‌.. చివ‌రివ‌ర‌కు ఈ చిత్రం ఎక్క‌డ ఆగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here