సునీల్ నిజం చెప్పేసాడు..!

Sunil Sudigadu 2
అదేం విచిత్ర‌మో కానీ ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రిపై రాన‌న్ని గాసిప్స్ అన్నీ సునీల్ పైనే వ‌స్తుంటాయి. ఈయ‌న చూడ్డానికి చాలా కామ్ గా ఉంటాడు కానీ గాలి వార్త‌లు మాత్రం భీమ‌వ‌రం బుల్లోడిపైనే వ‌స్తుంటాయి. దానికి కార‌ణం ఏంటో త‌న‌కు కూడా తెలియ‌దంటున్నాడు ఈ హీరో. అయితే ఈ గాసిప్స్ మాత్రం తాను కూడా ఎంజాయ్ చేస్తానంటున్నాడు సునీల్. ఇక ఇప్పుడు మ‌రో గాసిప్ కూడా ఈ హీరోపై చ‌క్క‌ర్లు కొట్టింది. దానికి సునీల్ తాజాగా క్లారిటీ కూడా ఇచ్చేసాడు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. అజ్ఞాత‌వాసిలో సునీల్ కూడా ఉండేలా ఓ రోల్ రాసాడు త్రివిక్ర‌మ్. కానీ దీనికి సునీల్ ఒప్పుకోలేదు. అవును.. ప‌వ‌న్ సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని తానే వ‌దిలేసాన‌ని చెప్పాడు సునీల్.
దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇందులో త్రివిక్ర‌మ్ కారెక్ట‌ర్ చెప్పిన‌పుడు పూర్తిగా చెప్ప‌లేద‌ని.. సోసోగానే చెప్పాడ‌ని.. పైగా ఆ టైమ్ లో తాను వేరే సినిమాల‌తో బిజీగా ఉన్నందుకు ప‌వ‌న్ సినిమా వ‌దిలేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందని చెప్పాడు సునీల్. అయితే అజ్ఞాత‌వాసి మిస్సైనా.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమాలో మాత్రం తాను న‌టిస్తు న్న‌ట్లు తేల్చేసాడు సునీల్. ఇక‌పై క‌మెడియ‌న్ గానూ స‌త్తా చూపిస్తాన‌ని చెబుతున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. అన్న‌ట్లు ఈయ‌న హీరోగా న‌టించిన 2 కంట్రీస్ డిసెంబ‌ర్ 29నే వ‌స్తుంది. సునీల్ హీరోగా నిల‌బ‌డాల‌న్నా.. త‌న‌ను తాను నిరూపించుకోవాల‌నుకున్నా.. ఈయ‌న చేతిలో ఉన్న చివ‌రి అస్త్రం 2 కంట్రీస్ సినిమానే. మ‌రి చూడాలిక‌.. ఏం చేస్తాడో ఈ హీరో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here