సునీల్.. బ్యాక్ ఆన్ ట్రాక్..!

Sunil NTR28
 
ఇక సునీల్ ను మిస్ అవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌ప్ప‌డు ఆయ‌న ఎలా న‌వ్వించేవాడో ఇప్పుడు కూడా అదే మాయ చూపించ‌డానికి వ‌స్తున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. తెలిసి చేసినా తెలియ‌క చేసినా త‌ప్పు త‌ప్పే. త‌ప్పు చేయ‌డం ఒక్కోసారి త‌ప్పు కాక‌పోవ‌చ్చు. కానీ చేసిన త‌ప్పు తెలుసుకోక‌పోవ‌డం మాత్రం త‌ప్పే. అదే త‌ప్పు మ‌ళ్లీ చేస్తే ఇక నేర్చుకున్న‌ది ఏముంటుంది..? ఇప్పుడు సునీల్ ఇలాంటి త‌ప్పు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఈయ‌న హీరోగా మారినప్ప‌ట్నుంచీ జాత‌కం తిర‌గ‌బడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2013లో పూల‌రంగ‌డితో వ‌చ్చిన విజ‌యం.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఈ ఐదేళ్ల‌లో ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్ష‌కులు మాత్రం సునీల్ ను చూడ‌లేక‌పోయారు. దాంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు సునీల్. ఈ విష‌యంలో చాలా సీరియ‌స్ గా ఉన్న సునీల్.. రీ ఎంట్రీని మాత్రం ఘ‌నంగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
అదేం విచిత్ర‌మో కానీ ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రిపై రాన‌న్ని గాసిప్స్ అన్నీ సునీల్ పైనే వ‌స్తుంటాయి. ఈయ‌న చూడ్డానికి చాలా కామ్ గా ఉంటాడు కానీ గాలి వార్త‌లు మాత్రం భీమ‌వ‌రం బుల్లోడిపైనే వ‌స్తుంటాయి. దానికి కార‌ణం ఏంటో త‌న‌కు కూడా తెలియ‌దంటున్నాడు ఈ హీరో. అయితే ఈ గాసిప్స్ మాత్రం తాను కూడా ఎంజాయ్ చేస్తానంటున్నాడు సునీల్. ఆ మ‌ధ్య అజ్ఞాత‌వాసిలో సునీల్ కోసం త్రివిక్ర‌మ్ ఓ రోల్ రాసాడు. కానీ బిజీ కార‌ణంగా అది వ‌దిలేసాడు. అయితే అజ్ఞాత‌వాసి మిస్సైనా.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇక దాంతోపాటు శీనువైట్ల‌-ర‌వితేజ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. శ‌ర్వానంద్ ప‌డిప‌డి లేచే మ‌న‌సు.. అల్ల‌రిన‌రేష్ సిల్లీఫెల్లోస్.. చిరంజీవి సైరా లాంటి సినిమాల్లో న‌టిస్తున్నాడు సునీల్. మ‌రి వీటితో మ‌నోడి కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డిన‌ట్లేనా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here