సూర్య‌కు కూడా చుక్క‌లేనా సాయిప‌ల్ల‌వి..!


సాయిప‌ల్ల‌విపై ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది. అద్భుత‌మైన న‌టి.. అంత‌కుమించి అద్భుత‌మైన డాన్స‌ర్ అని.. దానికి మించి మంచి అమ్మాయ‌ని పేరుంది. ప‌క్కింటి అమ్మాయిలా ఉంద‌ని అంతా మ‌న‌సులో దాచేసుకున్నారు ఈ బ్యూటీని. కానీ సాయిప‌ల్ల‌విలో మ‌రో అప‌రిచితురాలు కూడా ఉంద‌ని ఇప్పుడు ఇప్పుడే బ‌య‌టికి వ‌స్తుంది. ఈ భామ‌లో మ‌రో కోణం కూడా ఉంద‌ని.. అది ఇప్పుడు తెలుస్తుంద‌ని చెబుతున్నారు కొంద‌రు. ఇంత పోటీలోనూ అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటూ.. కేవ‌లం న‌ట‌న‌తోనే నెట్టుకొస్తుంది ఈ త‌మిళ పొన్ను. దానికి తోడు స్టార్ హీరోల సినిమాల‌ను కాద‌ని.. కేవ‌లం త‌న‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌ల్లోనే న‌టిస్తూ ఔరా అనిపిస్తుంది. ఇలాంటి హీరోయిన్ పై ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొన్ని రూమ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్యే నాగ‌శౌర్య నేరుగా పేరుపెట్టి మ‌రీ సాయిప‌ల్ల‌విని విమ‌ర్శించాడు.
క‌ణం త‌ర్వాత కూడా సాయిప‌ల్ల‌వి తీరు మార‌లేదంటున్నారు కొంద‌రు. ఇక ఇప్పుడు సూర్య‌-సెల్వ రాఘ‌వ‌న్ సినిమా షూటింగ్ కు కూడా సాయిప‌ల్ల‌వి ఆల‌స్యంగా వ‌స్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్యే సూర్య సినిమా షూటింగ్ మొద‌లైంది. ఈ షూటింగ్ యూనిట్ కు కూడా సాయిప‌ల్ల‌వి చుక్క‌లు చూపిస్తుంద‌ని తెలుస్తుంది. త‌న ఫేవ‌రేట్ హీరో సినిమా అయినా కూడా సాయిప‌ల్ల‌వి తీరు మాత్రం మార‌లేద‌ని.. ఇప్ప‌టికీ ఆల‌స్యంగా వ‌స్తూనే ఉంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఉద‌యం 9 గంట‌ల‌కు రావాల్సిన సెట్ కు 11-12 గంట‌ల‌కు వ‌స్తుందని.. దానివ‌ల్ల నిర్మాత‌ల‌తో పాటు చిత్ర‌యూనిట్ కూడా చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలుస్తుంది. చూడ్డానికి ఇంత అమాయ‌కంగా.. ఏం తెలియ‌న‌ట్లు ఉంటుంది కానీ సాయిప‌ల్ల‌విపై ఇలాంటి రూమ‌ర్లు వినిపించ‌డం మాత్రం విడ్డూర‌మే. మ‌రి చూడాలిక‌.. ఇలాంటి ఆటిట్యూడ్ తో ఇండ‌స్ట్రీలో సాయిప‌ల్ల‌వి ఇంకెంత కాలం స్టార్ గా నిల‌బ‌డుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here