సూర్య ఇరికించేసిన కార్తి..

Surya Wishes Karthi Over ‘Khakee’

అవును.. త‌మ్ముడే అన్న‌య్య‌ను బాగా ఇరికించేసాడు. కార్తి త‌మిళ హీరోనే అయినా కూడా తెలుగులో అంత త్వ‌ర‌గా ఇమేజ్ సంపాదించుకోడానికి కార‌ణం తెలుగు నేర్చుకోవ‌డం.. ఇక్క‌డ సొంత డ‌బ్బింగ్ చెప్పుకోవడం. కానీ కార్తి కంటే ముందే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన సూర్య మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు నేర్చుకోలేదు.. ఇక డ‌బ్బింగ్ మాట దేవుడెరుగు. కానీ ఇప్పుడు కార్తి వ‌చ్చిన త‌ర్వాత సూర్య‌పై ఒత్తిడి పెరిగిపోయింది. త‌మ్ముడే డ‌బ్బింగ్ చెప్పుకుంటుంటే అన్న ఎందుకు చెప్ప‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దాంతో సూర్య‌కు కూడా ఇప్పుడు త‌ప్ప‌ట్లేదు. అందుకే తెలుగు భాష మీద పట్టు సాధించి ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు. దీనికి కార‌ణాలు కూడా లేక‌పోలేవు. ఈ మ‌ధ్యే మ‌హేశ్ వ‌చ్చీ రాని త‌మిళ్లో స్పైడ‌ర్ లో డ‌బ్బింగ్ చెప్పుకున్నాడు. ఆ మాట‌లు అక్క‌డి ప్రేక్ష‌కుల‌కు బాగానే చేరువ‌య్యాయి.
దాంతో ఇప్పుడు సూర్య కూడా ఇదే చేస్తున్నాడు. త‌న‌కు వ‌చ్చిన తెలుగులోనే గ్యాంగ్ సినిమా కోసం తొలిసారి డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నాడు సూర్య‌. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ లో సూర్య వాయిస్ భ‌లే మ్యాజిక్ అనిపించింది. టీజర్ లో రెగ్యుల‌ర్ గా వ‌చ్చే సూర్య డ‌బ్బింగ్ వాయిస్ కాదు ఇది.. ఎవ‌రో భ‌లే చెప్పారే అనిపిస్తుంది కానీ కాసేప‌టికే ఇది సూర్య ఒరిజిన‌ల్ వాయిస్ అని అర్థ‌మైపోతుంది. త‌మిళ‌యాస ఉన్న తెలుగు మ‌త్తుగా భ‌లే ఫీల్ తెప్పిస్తుంది. ఇది కాస్త కొత్తగా అనిపించినా సినిమాలో ఇంకా బాగుంటుంద‌ని.. ఇదే సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని భావిస్తున్నాడు సూర్య‌. ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. ర‌మ్య‌కృష్ణ హీరోయిన్. మొత్తానికి అన్న‌య్య‌ను కార్తి ఇప్పుడు భ‌లే ఇర‌కాటంలో ప‌డేసాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here