సూర్య సినిమా కొట్టేసిన విక్ర‌మ్..


అనుకున్న‌దే జ‌రిగింది. సామి 2 ట్రైల‌ర్ చూసిన‌పుడే అంతా సింగంలా ఉందేంటి అనుకున్నారు. పైగా పోలీస్ క‌థ‌లు రాసి రాసి అన్నీ ఒకేలా తీయ‌డం అల‌వాటు చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు హ‌రి. కానీ ఎన్ని చేసినా మ‌ళ్లీ ఈయ‌న సినిమాల్లో స్క్రీన్ ప్లే మాయ న‌డుస్తుంది. ఆ స్క్రీన్ ప్లేతోనే ఒకే క‌థ‌ను ఎన్నిసార్లైనా చూసేలా తీస్తాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు విక్ర‌మ్ హీరోగా ఈయ‌న సామి స్క్వేర్ సినిమా చేస్తున్నాడు.
14 ఏళ్ల కింద వ‌చ్చిన సామి సినిమాకు సీక్వెల్ ఇది. ట్రైల‌ర్ చూసిన‌పుడే ఇది సింగం అని ఫిక్సైపోయారు అంతా. ఇప్పుడు ద‌ర్శ‌కుడు కూడా ఇదే క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఇది సింగం 4 కోసం రాసుకున్న క‌థే అని చెప్పి.. సింగం 3 ఫ్లాప్ కావ‌డంతోనే సామి 2 అంటూ విక్ర‌మ్ తో తీసానంటున్నాడు హ‌రి. ఈ చిత్రం కోసం పాత విక్ర‌మ్ లా మారిపోయాడు ఈ హీరో. ప్ర‌స్తుతం వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న విక్ర‌మ్ కు సామి స్క్వేర్ ఫ‌లితం కీల‌కం.
సింగంలో య‌ముడులో సూర్య‌, ప్ర‌కాశ్ రాజ్ సీక్వెన్స్ మాదిరే.. ఇప్పుడు విక్ర‌మ్, బాబీసింహా మ‌ధ్య ర‌చ్చ న‌డుస్తుంది. ట్రైల‌ర్ అంతా మ‌రోసారి మాస్ గా అల‌రించేసాడు హ‌రి. కీర్తిసురేష్ ఇందులో విక్ర‌మ్ తో జోడీక‌ట్టింది. ఐశ్వ‌ర్య రాజేష్ మ‌రో హీరోయిన్. ఈ చిత్రం ఇదే ఏడాది విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. మ‌రి చూడాలిక‌.. సూర్య సినిమాతో విక్ర‌మ్ హిట్ కొడ‌తాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here