సెన్సార్ పూర్తి చేసుకొన్న “హార్ట్ బీట్”

Heart Beat Cnesored with Clean U !
ధృవ, వెంబ జంటగా దేవాస్ మీడియా & ఎంటర్ టైన్మెంట్ పతాకంపై శ్యామ్ దేవభక్తుని నిర్మాణ సారధ్యంలో ద్వారక్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “హార్ట్ బీట్”. డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకొంది. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోగా అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్యామ్ దేవభక్తుని మాట్లాడుతూ.. “ఒక 16 ఏళ్లమ్మాయి తనకంటే వయసులో పెద్దవాడైన యువకుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం “హార్ట్ బీట్”. ఎక్కడా అసభ్యతకు, అశ్లీలతకు తావులేకుండా చాలా ఆసక్తికరంగా తెరకెక్కించాం. మా డైరెక్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అన్నీ వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికేట్ అందుకొన్నాం. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “హార్ట్” బీట్” చిత్రాన్ని అతీత్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here