సెన్సార్ ప్ర‌శంస‌ల‌తో యుఎ సాధించిన `శంభో శంక‌ర‌`

క‌మెడియ‌న్ ట‌ర్న్‌డ్ హీరోలుగా రాణిస్తున్న ఈ టైమ్‌లో ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా అదృష్టం ప‌రీక్షించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ న‌టించిన‌ `శంభో శంక‌ర‌` ట్రైల‌ర్‌, పోస్ట‌ర్ల‌కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ష‌క‌ల‌క శంక‌ర్‌ని హీరోగా, శ్రీధ‌ర్‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్. ఆర్. పిక్చ‌ర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ఈ సినిమా కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్రమిద‌ని సెన్సార్ స‌భ్యులు ప్ర‌శంసించారు. ఈ సీజ‌న్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డం ఖాయం అని ప్ర‌శంసించారు.

పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ విన్న త‌ర‌వాత నిర్మాత ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ-“ఇప్ప‌టికే టీజర్, పాటలకు అద్భుత‌ స్పందన లభించింది. దిల్‌రాజు వంటి అగ్ర‌నిర్మాత కం పంపిణీదారుడు ఈ సినిమా టీజ‌ర్‌ని ప్ర‌శంసించ‌డం అదృష్టం. ఇప్పుడు సెన్సార్ బృందం అంతే గొప్ప‌గా ప్ర‌శంసించింది. సెన్సార్ యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ప‌రిశ్ర‌మ‌లో పాజిటివ్ టాక్ వినిపించ‌డం ఉత్సాహం నింపుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ్ చేస్తున్నాం“ అని అన్నారు.

మ‌రో నిర్మాత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ -“ష‌క‌ల‌క శంక‌ర్ క‌థానాయ‌కుడిగానూ నిరూపించుకునే ప్ర‌య‌త్న‌మిది. తొలి ప్ర‌య‌త్న‌మే పెద్ద స‌క్సెస్ అవుతాడ‌న్న ధీమా ఉంది. టీజ‌ర్‌కి వ‌చ్చిన హైప్ దృష్ట్యా ఈ చిత్రాన్ని అత్యంత ఘ‌నంగా రిలీజ్ చేస్తున్నాం. సెన్సార్ యుఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి ప్ర‌శంసించింది. గ్రూప్‌లో ఒక స‌భ్యుడు ఈ సీజ‌న్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఇద‌ని ప్ర‌శంసించారు. శంక‌ర్ కెరీర్‌కి ఉప‌క‌రించే చిత్ర‌మిది. త‌న‌తో పాటు… న‌టీన‌టులంతా అద్భుతంగా లీన‌మై న‌టించారు. ఈ సినిమాలో న‌టించిన అంద‌రికీ కీల‌క‌మ‌లుపునిచ్చే సినిమా అవుతుంది“ అన్నారు.

షకలక శంక‌ర్, కారుణ్య నాగినీడు, అజ‌య్ ఘోష్, ర‌వి ప్రకాష్, ప్ర‌భు, ఏడిద శ్రీరామ్ త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్ర‌సాద్, నిర్మ‌తలు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్. ఎన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here