సేమ్ టూ సేమ్ దించేసావ్ సామి.


సామి.. ఒక‌ప్పుడు త‌మిళ ఇండ‌స్ట్రీని షేక్ చేసిన సినిమా ఇది. విక్ర‌మ్ ను స్టార్ గా మార్చేసిన సినిమా ఇది. అప్ప‌ట్లో ఈయ‌న ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో హ‌రి చేసిన ఈ మాస్ మ‌సాలా సినిమా రికార్డులు తిర‌గ‌రాసింది. ఇదే సినిమా తెలుగులో ల‌క్ష్మీన‌ర‌సింహాగా రీమేక్ చేసాడు బాల‌య్య‌.
ఈయ‌న కూడా మంచి విజ‌యం అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి 14 ఏళ్ల త‌ర్వాత సీక్వెల్ చేస్తున్నాడు హ‌రి. తాజాగా ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లైంది. ఏ మాత్రం మార‌కుండా హ‌రి మ‌రోసారి త‌న మార్క్ చూపించాడు. క‌థ కంటే ముందు కెమెరా ప‌రుగులు తీస్తుంది. పైగా ఈయ‌న మోష‌న్ పోస్ట‌ర్ అంతా సింగం స్టైల్ లోనే ఉంది. అయితే క‌థ పాత‌గా ఉన్నా.. క‌చ్చితంగా స్క్రీన్ ప్లే తో మాయ చేస్తుంటాడు హ‌రి.
ఈ సారి కూడా ఇదే చేస్తాడేమో మ‌రి..! కీర్తి సురేష్ ఇందులో విక్ర‌మ్ తో జోడీక‌ట్టింది. ఈ చిత్రం ఇదే ఏడాది విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా స‌గానికి పైగా పూర్త‌యింది. ఈ చిత్రం కోసం మ‌ళ్లీ పాత విక్ర‌మ్ లా మారిపోయాడు ఈ హీరో. ప్ర‌స్తుతం వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న విక్ర‌మ్ కు సామి స్క్వేర్ ఫ‌లితం కీల‌కం. మ‌రి చూడాలిక‌.. క‌నీసం హ‌రి అయినా విక్ర‌మ్ గోడును అర్థం చేసుకుంటాడో లేదో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here