సైన్స్ పాఠాలు నేర్చుకోనున్న వ‌రుణ్ తేజ్..

Varun Tej Tholiprema First Look Poster

ఒక‌ప్పుడు ప‌ది సినిమాలు చేసినా కూడా ద‌ర్శ‌కుల‌కు అంత క్రేజ్ వ‌చ్చేది కాదు.. ఎందుకంటే అప్పుడు ఉన్న ఎక్స్ పోజ‌ర్ త‌క్కువ‌. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక్క హిట్ కొట్టు ఇండ‌స్ట్రీ అంతా నీ పేరే మారుమోగిపోతుంది. అలాగే ఈ ఏడాది వార్త‌ల్లో నిలిచిన కుర్రాడు సంకల్ప్ రెడ్డి. ఘాజీ అనే ఒక్క సినిమాతో సెన్సేష‌న్ సృష్టించాడు ఈ కుర్రాడు. షార్ట్ ఫిల్మ్ గా మొద‌లుపెట్టి.. ఇండియా మొత్తం మెచ్చిన చిత్రంగా ఘాజీని మ‌లిచాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. రానాకు తొలి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ఇచ్చి ఆయ‌న మార్కెట్ పెంచాడు సంక‌ల్ప్ రెడ్డి. ఈ సినిమా వ‌చ్చి 10 నెల‌లు దాటినా ఇప్ప‌టి వ‌ర‌కు సంక‌ల్ప్ రెండో సినిమాపై ఎలాంటి అప్ డేట్ ఇవ్వ‌లేదు. కానీ ఇప్పుడు ఈయన సెకండ్ హీరో క‌న్ఫ‌ర్మ్ అయిపోయాడు.
అత‌డు మ‌రెవ‌రో కాదు.. వ‌రుణ్ తేజ్. ఫిదా త‌ర్వాత కొత్త జోష్ లో ఉన్న వ‌రుణ్ తేజ్.. ప్ర‌స్తుతం వెంకీ అట్లూరితో తొలిప్రేమ‌ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఈ చిత్రం త‌ర్వాత వ‌ర‌స సినిమాల‌కు క‌మిట‌వుతున్నాడు వ‌రుణ్ తేజ్. తాజాగా ఈయ‌న ఖాతాలో సంక‌ల్ప్ రెడ్డి సినిమా వ‌చ్చి ప‌డింది. ఘాజీ కుర్రాడు చెప్పిన క‌థ‌కు వ‌రుణ్ బాగా ఇంప్రెస్ అయ్యాడ‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే వీళ్ళ కాంబినేష‌న్ లో సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. పివిపి ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాడు. ఈ చిత్రం సైన్స్ ఫిక్ష‌న్ అని తెలుస్తోంది. మ‌రి చూడాలిక‌.. వ‌రుణ్ తేజ్ తో ఘాజీ కుర్రాడి సినిమా ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here