సైరాను అడ్డుకున్న రామ్ చ‌ర‌ణ్.. 

Sye Raa Narasimha Reddy second schedule
అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. నిజంగానే తండ్రి సినిమాను ఇప్పుడు చ‌ర‌ణ్ అడ్డుకుంటున్నాడు. అదేంటి.. సైరా సినిమాకు నిర్మాత కూడా ఆయ‌న క‌దా.. ఆయ‌నెందుకు అడ్డుకుంటున్నాడు అనుకుంటున్నారా..? ఇక్క‌డే ఉంది క‌దా అసలు ట్విస్ట్. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు సుకుమార్. ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది కూడా. దీనికి ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫర్. మ‌రోవైపు సైరా సినిమాకు కూడా డిఓపి ర‌త్న‌వేలే. ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు స‌మ‌స్య‌. ఇప్ప‌టికీ రంగ‌స్థ‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా పూర్తి కాలేదు. పైగా ప‌ర్ ఫెక్ష‌న్ కోసం ప్రాణం ఇచ్చే సుకుమార్.. రంగ‌స్థ‌లం రీ షూట్ అంటూ మ‌రో వారం రోజులు పొడిగించాడు. దాంతో ర‌త్న‌వేలు ఇక్క‌డ లాక్ అయిపోయాడు. అందుకే సైరా ఇప్ప‌ట్లో ప‌ట్టాలెక్క‌డం క‌ష్టంగా క‌నిపిస్తుంది.
ఇప్ప‌టికే కేర‌ళలో జ‌ర‌గాల్సిన రెండో షెడ్యూల్ కాస్తా హైద‌రాబాద్ కు వ‌చ్చింది. ఇప్పుడు ఇది కూడా మ‌రోసారి వాయిదా ప‌డింది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రుగుంటే ఫిబ్ర‌వ‌రి 23 నుంచి సైరా రెండో షెడ్యూల్ మొద‌లవ్వాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ తేదీ మార్చ్ కు వెళ్లిపోయింది. అప్ప‌ట్లో తండ్రి సైరా కోసం త‌న రంగ‌స్థ‌లం షూటింగ్ ఆపుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇప్పుడు రంగ‌స్థ‌లం కోసం తండ్రి సినిమాను ఆపేస్తున్నాడు. చెల్లుకు చెల్లు.. మొత్తానికి తండ్రి కోసం త‌న‌యుడు.. త‌న‌యుడి కోసం తండ్రి.. ఇద్ద‌రూ మంచి సామాజిక న్యాయం చేస్తున్నారు. మార్చ్ 30న రంగ‌స్థ‌లం విడుద‌ల కానుంది. ఆ త‌ర్వాత సైరాకు ఇంక బ్రేకులు ఉండ‌క‌పోవ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here