సైరా కాంట్ర‌వ‌ర్సీ.. చ‌ర‌ణ్ సూప‌ర్ షార్ప్.

RAM CHARAN SYE RAA
ఒక‌టి రెండు కాదు.. 200 కోట్ల సినిమా క‌దా.. ఏ చిన్న ఇష్యూ అయినా కూడా సినిమాకు కూడా బ్యాడ్ నేమ్ వ‌స్తుంది అందుకే సైరా విష‌యంలో ఎక్కువ‌గా ర‌చ్చ చేయ‌డం లేదు రామ్ చ‌ర‌ణ్. ఈ మ‌ధ్యే సెట్ కూల్చివేత ఇష్యూలో బాగానే వార్త‌ల్లోకి ఎక్కింది ఈ చిత్రం. ముఖ్యంగా అనుమ‌తి లేకుండా అక్క‌డ షూటింగ్ చేస్తున్నారంటూ గ‌వ‌ర్న‌మెంట్ అధికారులు వ‌చ్చి ప‌డ్డారు. దీనిపై ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తుంది. నిజానికి సెట్ కూల్చివేతకు ముందే నిర్మాత రామ్ చరణ్‌కు అధికారుల నుండి నోటీసులు వ‌చ్చాయ‌ని తెలుస్తుంది. అయితే ఈ విష‌యంలో చ‌ర‌ణ్ కూడా చాలా తెలివిగా ఈ ఇష్యూను డీల్ చేస్తున్నాడు.
నోటీసులు వచ్చిన వెంటనే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా మ‌రో చోట కూడా సెట్ కు సిద్ధం చేసాడు ఈ హీరో క‌మ్ ప్రొడ్యూస‌ర్. ఇప్ప‌టికే సైరా కొత్త సెట్ ప‌నులు కూడా పూర్త‌య్యాయ‌ని తెలుస్తుంది. ఎలాంటి సమస్య లేకుండా కొత్త షెడ్యూల్ కు అంతా సిద్ధం చేస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. యూర‌ప్ లో కొన్ని రోజుల షెడ్యూల్ త‌ర్వాత ఇక్క‌డే ఈ కొత్త సెట్ లోనే మ‌రో నెల పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. మొత్తానికి ఆ వివాదం నుంచి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌టికి రావాల‌ని చూస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. అన్న‌ట్లు ఈ చిత్ర టీజ‌ర్ ఆగ‌స్ట్ 22న చిరంజీవి బ‌ర్త్ డే కానుక‌గా విడుద‌ల కానున్న‌ట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here