సైరా.. బ్యాక్ ఆన్ ట్రాక్..


అవును.. ఒక్కొక్క‌టిగా మ‌ళ్లీ అన్నీ ట్రాక్ ఎక్కుతున్నాయి. సైరా రెండో షెడ్యూల్ ఇప్ప‌టికే మొద‌ల‌వ్వాల్సి ఉన్నా కూడా అనుకోని కార‌ణాల‌తో అది పోస్ట్ పోన్ అయింది. అయితే అది ఇప్పుడు మొద‌లుపెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ఈ సినిమా రెండో షెడ్యూల్ ను మార్చ్ 5 నుంచి మొద‌లు పెట్ట‌నున్నారు. రంగ‌స్థ‌లం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఇంకా పూర్తి కాక‌పోవ‌డంతో డివోపి ర‌త్న‌వేలు ఇక్క‌డ లాక్ అయ్యాడు. ఈ రెండు సినిమాల‌కు ఆయ‌నే సినిమాటోగ్ర‌ఫ‌ర్. దాంతో సైరా రెండో షెడ్యూల్లో జాప్యం జ‌రిగింది. ఇప్ప‌టికే కేర‌ళలో జ‌ర‌గాల్సిన రెండో షెడ్యూల్ కాస్తా హైద‌రాబాద్ కు వ‌చ్చింది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రుగుంటే ఫిబ్ర‌వ‌రి 23 నుంచే మొద‌ల‌వ్వాల్సిన‌ సైరా రెండో షెడ్యూల్ ఇంకా కాలేదు. మార్చ్ 5 నుంచి నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్ తో పాటు న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుపతి, జ‌గ‌ప‌తిబాబు, సుదీప్ లాంటి స్టార్స్ అంతా ఈ షెడ్యూల్ లోనే చిరుతో పాటు జాయిన్ కానుండ‌టం విశేషం. ఇది భారీ షెడ్యూల్ అని తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. సైరా రెండో షెడ్యూల్లో చిరు ఎలాంటి సాహ‌సాలు చేయ‌బోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here