సోకుల సోనాక్షి.. అందాల మీనాక్షి.. 

కెరీర్ కొత్త‌లో ఉన్న‌ట్లు కెరీర్ అంతా ఉండాలంటే క‌ష్టం. ముఖ్యంగా హీరోయిన్లు. వాళ్ల‌కు విజ‌యాలు వ‌చ్చిన‌పుడు ఎక్స్ పోజింగ్ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. పైగా వాళ్ల‌కు ఇండ‌స్ట్రీలో బ్యాగ్రౌండ్ బాగా ఉండి.. స్టార్ హీరోల స‌పోర్ట్ ఉన్న‌పుడు అస‌లు వాళ్ల‌ను గ్లామ‌ర్ షో చేయ‌మ‌నే ద‌మ్ము కూడా ఏ ద‌ర్శ‌కుడికి ఉండ‌దు. సోనాక్షి సిన్హా విష‌యంలో ముందు ఇలాగే జ‌రిగింది. ఈమె న‌టించిన తొలి సినిమా ద‌బంగ్ హిట్ట‌వ్వ‌డంతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. అస‌లేం జ‌రిగిందో తెలుసుకునే లోపు మ‌రో మూడు నాలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు వ‌చ్చేసాయి. దాంతో ఎక్స్ పోజింగ్ అనే మాటే లేకుండా నెం. 1 అయిపోయింది. కానీ ఎంత వేగంగా టాప్ లోకి వ‌చ్చిందో.. అంతే వేగంగా కింద‌కి ప‌డిపోయింది కూడా.
ఒక‌ప్పుడు గ్లామ‌ర్ షో అంటే నాన్న‌గారు ఒప్పుకోరండీ అన్న సోనాక్షి.. ఇప్పుడు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. అవ‌కాశాల కోసం విలువలు ప‌క్క‌న బెట్టి వ‌లువ‌లు త‌గ్గించేస్తుంది సోనాక్షి. కెరీర్ మొద‌ట్లో ఎక్స్ పోజింగ్ అంటే అంతెత్తు ఎగిరిప‌డే సోనాక్షి.. ఇప్పుడు అడ‌క్క‌పోయినా ప్ర‌తీ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది. ఇక ఆ మ‌ధ్య‌ సిడ్నీ బీచ్ లో చిట్టి నిక్క‌రు.. తొడ‌లు క‌నిపించేలా షార్టులు వేసుకుని మ‌తులు పోగొట్టింది సోనాక్షి. ఇప్ప‌డు కూడా అడ‌క్క‌పోయినా హాట్ షో చేస్తూ మ‌తులు చెడ‌గొట్ట‌డానికి రెడీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఈ మ‌ధ్య కాలంలో బాగా బ‌రువు పెరిగిపోయిన సోనాక్షి.. అర్జంట్ గా త‌గ్గించే ప‌నిలో ప‌డిపోయింది. ఇక ఇప్పుడు కూడా బీచ్ లో చిన్న చిన్న బ‌ట్ట‌లేసుకుని అమ్మాయిగారు ఫుల్లుగా అందాల‌న్నీ ఆర‌బోసారు. మొత్తానికి ఎవ్వ‌రైనా.. ఎంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నా అవ‌కాశాల కోసం క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు అని సోనాక్షిని చూస్తే అర్థ‌మైపోతుంది క‌దూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here