స్విమ్మింగ్ పూల్ లో శ్రీ‌య అందాల బాణం..

SRIYA SARAN NEW PHOTOSHOOT
ఒక‌టి రెండు మూడు.. ఇలా ఏళ్లు గ‌డిచిపోతున్నాయి.. కేలండ‌ర్స్ మారిపోతున్నాయి.. కానీ ఆమె అందం మాత్రం ఇప్ప‌టికీ అలాగే ఉంది. అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద ఆమెను తొలి సినిమాలో ఎలాగైతే చూసామో ఇప్ప‌టికీ అలాగే క‌నిపిస్తుంది. ఇన్నేళ్లు ఒకే ఫిజిక్ ఉండాలంటే.. దాని వెన‌క ఎంత క‌ష్టం దాగుందో పాపం..! అందుకే ఇప్ప‌టికీ వ‌ర‌స అవ‌కాశాలిచ్చి ఆమె క‌ష్టాన్ని గుర్తిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌నం మాట్లాడుకుంటున్న‌ది శ్రీ‌య గురించే. ఈమెతో పాటు వ‌చ్చిన ముద్దుగుమ్మ‌లంతా ఇప్ప‌టికీ ఆంటీలు అయిపోయారు.. కొంద‌రు అమ్మలు కూడా అయిపోయారు. కానీ ఇప్ప‌టికీ శ్రీ‌య మాత్రం హీరోయిన్ గానే ఉంది. ఇప్పుడు కూడా త‌మిళ్ లో కార్తిక్ న‌రేన్ తెర‌కెక్కిస్తోన్న న‌ర‌గాసుర‌న్ లో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్రంతో పాటు మ‌రో రెండు మూడు సినిమాల‌కు క‌మిటైంది శ్రీ‌య‌. మోహ‌న్ బాబు, విష్ణు గాయ‌త్రి సినిమాలోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఈ భామ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.
తెలుగులో సీనియ‌ర్ హీరోల‌కు శ్రీ‌య బెస్ట్ ఆప్ష‌న్ గా మారిపోయింది. ఆ మ‌ధ్య గోపాలా గోపాలాలో వెంక‌టేశ్ కు భార్య‌గా న‌టించిన శ్రీ‌య‌.. ఈ మ‌ధ్యే బాల‌య్యతో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, పైసావ‌సూల్ లో న‌టించింది. ఇక హిందీలోనూ ఉల‌వ‌చారు బిర్యానీ రీమేక్ త‌డ్కాలో న‌టిస్తోంది. సినిమాకు క‌నీసం 35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తోంది ఈ భామ‌. దీనికి తోడు ఫ్యాష‌న్ వీక్స్, ఈవెంట్స్, డాన్సులు అంటూ ఏడాదికి క‌నీసం 3 కోట్ల వ‌ర‌కు వెన‌కేస్తోంది శ్రీ‌య‌. పైగా ఇప్ప‌టికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొట్టేస్తోంది ఈ భామ‌. ఈ మ‌ధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది. ఇక ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో కాళ్లు బ‌య‌టికి పెట్టుకుని కూర్చున్న శ్రీ‌యాను చూసి కుళ్లుకుంటున్నారు ముద్దుగుమ్మ‌లు. ఐదేళ్లు ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయ‌డానికే నానా తిప్ప‌లు ప‌డుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 17 ఏళ్లు ఒకేలా క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఆ సీక్రేట్ ఏంటో మిగిలిన హీరోయిన్ల‌కు కూడా చెబితే కాస్త హెల్ప్ అవుతుంది క‌దా శ్రీ‌యా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here