స‌మ్మోహ‌నంగా ఊరిస్తున్న అదితి..

అదితిరావ్ హైద్రీ.. ఇన్నాళ్లూ ఈ పేరుకు తెలుగులో త‌క్కువ గుర్తింపు ఉంది కానీ త్వ‌ర‌లోనే ఈ భామ ఇమేజ్ అలా పెరిగిపోయే రోజు ద‌గ్గ‌ర్లోనే ఉంది. దానికి కార‌ణం తెలుగులోనూ ఇక‌పై వ‌ర‌స‌గా సినిమాలు చేస్తుంది ఈ తెలుగ‌మ్మాయి. హైద్రాబాద్ నుంచే ముంబైకి వెళ్లింది అదితిరావ్ హ‌ద్రీ.

అక్క‌డే సెటిల్ కావ‌డంతో సొంత ఇండ‌స్ట్రీని అస్స‌లు ప‌ట్టించుకోలేదు అదితి. ఇక ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ పిలిచి అవ‌కాశాలు ఇస్తుండ‌టంతో బాలీవుడ్ ను కూడా కాద‌ని ఇక్క‌డికి వ‌స్తుంది ఈ భామ‌. తాజాగా స‌మ్మోహనంలో సొంత డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది అదితి. ఈ చిత్రంపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. దానికి కార‌ణం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ఆయ‌న సినిమా అంటే క‌చ్చితంగా బాగుంటుంది అనే న‌మ్మ‌కం అయితే ప్రేక్ష‌కుల్లో ఉంది.

పైగా ఈ సారి కాస్త కాంట్ర‌వ‌ర్సియ‌ల్ గా ఇండ‌స్ట్రీపైనే సెటైర్లు వేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్ గానే న‌టించింది. ఇప్పుడు విడుద‌లైన స్టిల్స్ లో చాలా అందంగా ఊరిస్తుంది అదితి. కొన్ని స్టిల్స్ అయితే మ‌రీ మత్తెక్కించేలా ఉన్నాయి. క్లీవేజ్ షోతో అదితి స‌మ్మోహ‌నంగా ఆహ్వానిస్తుంది. జూన్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి అదితి ఎంట్రీ ఎలా ఉండబోతుందో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here