స‌మ్మోహ‌నం.. అలా ముగిసింది పాపం..!


రెండేళ్ల కింది వ‌ర‌కు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ సినిమాలు అంటే కేవ‌లం ప్ర‌శంస‌ల వ‌ర‌కే ప‌రిమితం అనుకునే వాళ్లు. దానికి త‌గ్గ‌ట్లే అప్ప‌ట్లో ఆయ‌న సినిమాలు కూడా అలాగే ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈయ‌న సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గానూ స‌త్తా చూపిస్తున్నాయి. వ‌ర‌స హిట్ల‌తో ర‌చ్చ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అయితే ఇప్పుడు స‌మ్మోహ‌నం మాత్రం విజ‌యానికి కాస్త దూరంలోనే ఆగిపోయింది.
ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యం సాధిస్తుంద‌నుకున్నారంతా. కానీ సేఫ్ జోన్ కు రాకుండానే ప్ర‌యాణం ముగించింది స‌మ్మోహ‌నం. మూడు వారాలు కావొస్తున్నా ఇప్ప‌టికీ ఈ చిత్రం డెడ్ లైన్ 8 కోట్లు సాధించ‌లేక‌పోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు 7.50 కోట్ల షేర్ తీసుకొచ్చింది స‌మ్మోహ‌నం. సుధీర్ బాబు రేంజ్ కు ఇది ఎక్కువే.
ఈయ‌న గ‌త సినిమాల‌కు ఓపెనింగ్స్ ఇంకా వీక్ గా ఉండేవి. కానీ స‌మ్మోహ‌నం మెల్ల‌గా స‌మ్మోహ‌న‌ప‌రిచింది. కానీ ఫుల్ ర‌న్ లో ఇంకాస్త స‌మ్మోహ‌న ప‌ర‌చాల్సింది అంటున్నారు బ‌య్య‌ర్లు. అదితి రావ్ హైద్రీ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రాన్ని శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించారు. మొత్తానికి స‌మ్మోహ‌నం సుధీర్ బాబు కెరీర్ కు బాగా ప‌నికొచ్చింది కానీ ఇంద్ర‌గంటి కోరుకున్న విజ‌యం మాత్రం రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here