ఏమైందో తెలియదు నాకు అంటూ ఈ మధ్యే నాని ఓ పాట పాడాడు ఎంసిఏలో సాయిపల్లవిని చూస్తూ. ఇప్పుడు ఈ పాట రకుల్ కు బాగా సూట్ అవుతుంది. అంతగా మాయ చేస్తుంది ఈ భామ. నిజంగానే ఇప్పుడు ఈమెను చూస్తుంటే మతి ఎటు పోతుందో.. మనసు ఎటు కదులుతుందో ఎవరికీ క్లారిటీ లేదు.
అంతగా సెగలు పుట్టించింది రకుల్. ఇన్నాళ్ళూ ఈ అందాలన్ని ఎవరికోసం దాచేసిందో తెలియదు కానీ బాలీవుడ్ కు వెళ్లగానే తాళం తెరిచేసింది. అక్కడి నీళ్ల మహిమ అంతేనేమో మరి. ఇక్కడున్నపుడు సూక్తులు చెప్పే రకుల్.. అక్కడికి వెళ్లిన తర్వాత మాత్రం అవన్నీ తీసి పక్కనబెట్టేసింది. మొన్నటికి మొన్న మ్యాగ్జిమ్ ఫోటోషూట్ లో మ్యాగ్జిమమ్ అందాలన్నీ ఆరబోసింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మరోసారి ఫిల్మ్ ఫేర్ కోసం వయ్యారాలన్నీ ఒలకబోసింది ఈ ముద్దుగుమ్మ.
బికినీకి తక్కువ కాని డ్రస్ లో అమ్మడు ఒలకబోసిన వయ్యారాలు చూసి సమ్మర్ కు కూడా చెమటలు పట్టడం ఖాయం. ఫిల్మ్ ఫేర్ అంటేనే అందాల ప్రదర్శన అని అర్థం. అక్కడికి వెళ్లారంటే అన్నీ ఓపెన్ ఆఫర్ అని అర్థం. ఇప్పుడు రకుల్ కు కూడా ఇది తప్పలేదు. అందాలన్నీ తెరిచేసి కెమరాకు పరిచేసింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ లాంటి హీరోలతోనూ రొమాన్స్ చేసే అవకాశం అందుకుంది ఈ భామ. మొత్తానికి తన దూకుడుకు అందాన్ని జోడించి అలా దూసుకెళ్లిపోతుంది ఈ ముద్దుగుమ్మ.