స‌ల్మాన్ తో చిందేసిన శృతిహాస‌న్..

అదేంటి.. ఇప్పుడు శృతిహాస‌న్ సినిమాలే చేయ‌డం లేదు క‌దా.. మ‌రి సల్మాన్ తో ఎప్పుడు చిందేసింది అనుకుంటున్నారా..? అవును.. ఆమె సినిమాల‌కు మాత్ర‌మే దూర‌మైంది. కానీ సినిమా ఈవెంట్ ల‌కు కాదు. న‌ట‌న‌కు స్వస్తి చెప్పిన శృతి.. ఇప్పుడు త‌న ప్రైవేట్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే రిటైర్మెంట్ ఇచ్చేసి సింపుల్ గా మ్యూజిక‌ల్ రాక్ బ్యాండ్ ను సిద్ధం చేసుకుంటుంది. ఇంత బిజీగా ఉంటూనే అప్పుడప్పుడూ ఫంక్ష‌న్ ల‌కు కూడా వెళ్తుంటుంది శృతిహాస‌న్. తాజాగా మ‌ళ‌యాల అవార్డ్ వేడుకకు హాజ‌రైంది ఈ ముద్దుగుమ్మ‌. అక్క‌డి వ‌నిత అవార్డ్స్ 2018 వేడుక‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ తో క‌లిసి అదిరిపోయే స్టెప్పులేసింది శృతి. యాంక‌ర్ వ‌చ్చి కోర‌డంతో కాద‌న‌లేని శృతిహాస‌న్.. దుల్క‌ర్ స‌ల్మాన్ తో క‌లిసి వేదాళం సినిమా లోని ఆలుమా డోలుమా పాట‌కు మాస్ చిందులేసింది. దుల్క‌ర్ కూడా శృతితో కాసేపు కాలు క‌దిపాడు. ఇప్పుడు శృతిహాస‌న్, స‌ల్మాన్ డాన్సులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here